హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nothing Launcher: మరిన్ని స్మార్ట్‌ఫోన్లకు అందుబాటులోకి వచ్చిన నథింగ్ లాంచర్.. ఈ OS వివరాలివే..

Nothing Launcher: మరిన్ని స్మార్ట్‌ఫోన్లకు అందుబాటులోకి వచ్చిన నథింగ్ లాంచర్.. ఈ OS వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత నెలలో నథింగ్ కంపెనీ నథింగ్ లాంచర్‌ (Nothing Launcher)ను లాంచ్ చేసింది. ఆ సమయంలో ఇది కొన్ని సెలెక్టెడ్ ఫోన్లకు మాత్రమే సపోర్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఓఎస్.. ఆండ్రాయిడ్ 11, అంతకన్నా ఎక్కువ వెర్షన్లపై రన్ అవుతున్న అన్ని ఫోన్లకు అందుబాటులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...

ప్రముఖ టెక్ స్టార్టప్ కంపెనీ నథింగ్ (Nothing) నుంచి కొత్తగా నథింగ్ ఓఎస్ (NothingOS), నథింగ్ ఫోన్ (1) కొద్ది నెలల్లో రిలీజ్ కానున్నాయి. యాపిల్ ఐఫోన్లకు ఆల్టర్నేటివ్‌గా వస్తున్నట్లు చెబుతున్న నథింగ్ ఫోన్‌పై మొబైల్ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నథింగ్ ఓఎస్ కూడా ఫోన్ లవర్స్ లో ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో నథింగ్ కంపెనీ(Nothing Company)  నథింగ్ లాంచర్‌ (Nothing Launcher)ను లాంచ్(Launch) చేసింది. ఆ సమయంలో ఇది కొన్ని సెలెక్టెడ్ ఫోన్లకు(Selected Phones) మాత్రమే సపోర్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఓఎస్.. ఆండ్రాయిడ్ 11, అంతకన్నా ఎక్కువ వెర్షన్లపై రన్ అవుతున్న అన్ని ఫోన్లకు అందుబాటులోకి వచ్చింది.

మీ వద్ద ఆండ్రాయిడ్ 11 లేదా అంతకన్నా లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ల సాయంతో పనిచేసే ఫోన్ ఉంటే.. నథింగ్ లాంచర్‌ను https://t.co/rNVvInflCU ఈ లింక్ ద్వారా లేదా గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ లాంచర్‌ ద్వారా అప్‌కమింగ్ నథింగ్ ఓఎస్, అప్‌కమింగ్ నథింగ్ ఫోన్ అందించే యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ ఆస్వాదించవచ్చు. నథింగ్ కంపెనీ తమ ఫోన్, ఓఎస్ లో సింప్లిసిటీ, మినిమలిజం అందిస్తామని చెబుతోంది. మీరు ఈ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్‌ పొందడానికి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నథింగ్ లాంచర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కంపెనీ ఇప్పుడు నథింగ్ లాంచర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ చేసేందుకు కావాల్సిన సలహాలను కూడా “హౌ టు సెటప్” పేజీలో అందించింది. లాంచర్ వాల్‌పేపర్‌ను మార్చడం ఇప్పుడు మరింత సులభతరం చేసింది. అదనంగా అలర్ట్ సౌండ్స్, వాల్‌పేపర్‌లను డౌన్‌లోడ్ చేసుకునేలా డ్రాప్‌బాక్స్ లింక్‌ను అందిస్తుంది. నథింగ్ లాంచర్ సెట్టింగ్స్ ద్వారా డ్రాప్‌బాక్స్ లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు.

నథింగ్ లాంచర్‌లో మ్యాక్స్ ఐకాన్స్, ఫోల్డర్‌లతో పాటు ప్రత్యేకమైన గ్రాఫిక్స్, యానిమేషన్‌లను చెక్ చేయవచ్చు. మ్యాక్స్ ఐకాన్స్, ఫోల్డర్స్ అనే రెండు ఫీచర్లు ట్యాప్, హోల్డ్ చేయడం ద్వారా ఇండివిడ్యువల్ యాప్‌లు లేదా యాప్ ఫోల్డర్ల సైజును పెద్దగా చేసుకునేందుకు అనుమతిస్తాయి. డాట్-మ్యాట్రిక్స్ స్టైల్‌లో క్లాక్, వెదర్ విడ్జెట్ కూడా మీరు పొందుతారు.

Mystery Deaths: ఇటు ఉక్రెయిన్ పై యుద్ధం.. అటు మధ్య రష్యాలోని ప్రముఖుల ఆత్మహత్యలు.. ఏంటి ఈ మిస్టరీ..


నథింగ్‌ లాంచర్ (బీటా) గురించి యూజర్లు అందించిన ఫీడ్ బ్యాక్ ని పరిగణలోకి తీసుకొని నథింగ్‌ దాని NothingOS స్కిన్‌ను మరింత మెరుగ్గా తయారు చేస్తుంది. లాంచర్ ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్21, ఎస్22 సిరీస్‌లతో పాటు గూగుల్ పిక్సెల్ 5, గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తాజా అప్‌డేట్‌తో, లాంచర్‌ ఇప్పుడు ఆండ్రాయిడ్ 11, 11 అబౌవ్ వెర్షన్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే యూజర్లు నథింగ్ లాంచర్ యూజ్ చేయవచ్చు. నథింగ్ ఫోన్ 1 స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ ఓఎస్ తో ఇండియాలో జులై లేదా ఆగస్టులో నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నథింగ్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు కార్ల్ పీ కూడా నథింగ్ ఫోన్ (1)ని 2022 సమ్మర్‌లో లాంచ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

First published:

Tags: 5g technology, Nothing, Nothing mobile, Technology

ఉత్తమ కథలు