హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nothing Ear (2): నథింగ్ నుంచి కొత్త ప్రొడక్ట్.. మార్చి 22న ‘నథింగ్ ఇయర్(2)’ TWS ఇయర్‌బడ్స్ లాంచ్

Nothing Ear (2): నథింగ్ నుంచి కొత్త ప్రొడక్ట్.. మార్చి 22న ‘నథింగ్ ఇయర్(2)’ TWS ఇయర్‌బడ్స్ లాంచ్

PC : Nothing

PC : Nothing

Nothing Ear (2): యూకే బేస్ట్ టెక్ కంపెనీ నథింగ్ (Nothing) నుంచి మరో ప్రొడక్ట్ లాంచ్ కానుంది. ఇప్పటికే నథింగ్ ఫోన్ (1) స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ సంస్థ.. ఈ ఏడాది ఫస్ట్ ప్రొడక్ట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యూకే బేస్ట్ టెక్ కంపెనీ నథింగ్ (Nothing) నుంచి మరో ప్రొడక్ట్ లాంచ్ కానుంది. ఇప్పటికే నథింగ్ ఫోన్ (1) స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ సంస్థ.. ఈ ఏడాది ఫస్ట్ ప్రొడక్ట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 22న లేటెస్ట్ TWS ఇయర్‌బడ్స్‌ లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. నథింగ్ ఇయర్ (2) (Nothing ear (2)) పేరుతో ఇది మార్కెట్లోకి రానుంది. నథింగ్ ఇయర్ (1) ఇయర్‌బడ్స్‌కు సక్సెసర్‌గా లేటెస్ట్ బడ్స్ రానున్నాయి. నథింగ్ ఇయర్ (2) ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.

నథింగ్ ఈసారి స్పీకర్లను లాంచ్ చేస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ పుకార్లకు చెక్ పెడుతూ.. లేటెస్ట్ ఇయర్‌బడ్స్ లాంచ్ డేట్, టైమ్‌తో పాటు ప్రొడక్ట్ పేరును కంపెనీ రివీల్ చేసింది. నథింగ్ నుంచి వచ్చిన ఫస్ట్ TWS ఇయర్‌బడ్స్ నథింగ్ ఇయర్ (1)కి కొద్దిపాటి మార్పులు చేసి నథింగ్ ఇయర్ (2)ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ ప్రొడక్ట్‌లో డిజైన్ మార్పులతో పాటు నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్‌ను రీ-లొకేట్ చేశారు.

* లాంచ్ టైమ్ ఎప్పుడు?

నథింగ్ ఇయర్ (2) లాంచ్ ఈవెంట్ మార్చి 22న రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ప్రొడక్ట్ లాంచ్ అయ్యాక, ఇండియాలో దీని సేల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి.

* డిజైన్

నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్స్, కంపెనీ సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ లాంగ్వేజ్ డిజైన్‌లోనే రానున్నాయి. కంపెనీ పోస్ట్ చేసిన టీజర్‌ను బట్టి చూస్తే.. ఈ లేటెస్ట్ ఇయర్‌బడ్స్ కేస్ పారదర్శకంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : 2022లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌ ఇదే.. మీరు కొన్నారా!

* ఫీచర్లు

నథింగ్ ఇయర్ (2)లో డ్యుయల్ పెయిరింగ్, అడ్వాన్స్‌డ్ కస్టమ్ ఈక్వలైజర్, ఫైండ్ మై ఇయర్‌బడ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయని కొన్ని రిపోర్ట్ చెబుతున్నాయి. ఈ ప్రొడక్ట్ బెటర్ సౌండ్, బెటర్ క్లారిటీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. పర్సనలైజ్డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌తో ఇయర్‌బడ్స్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించనున్నాయి.

ఈ స్పెసిఫికేషన్‌తో యూజర్లు తమ కంఫర్ట్‌కు తగ్గట్టు నాయిస్ క్యాన్సిలేషన్ లెవల్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు. బెస్ట్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఈ ప్రొడక్ట్ ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ డ్యుయల్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. అంటే యూజర్లు రెండు డివైజ్‌లకు బడ్స్‌ను ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. ఇది అడ్వాన్స్‌డ్ కస్టమ్ ఈక్వలైజర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

* ధర ఎంత?

నథింగ్ ఇయర్ (1) ఇండియాలో రూ. 5,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అయితే నథింగ్ ఇయర్ (2) ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కంపెనీ ధరలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ముందు ఏయే ప్రాంతాల్లో ఈ ఆడియో ప్రొడక్ట్ అందుబాటులోకి వస్తుందనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. లాంచింగ్ ఈవెంట్‌లోనే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.

First published:

Tags: Earbuds, Nothing, Tech news

ఉత్తమ కథలు