వన్‌ప్లస్ మాజీ ఎగ్జిక్యూటివ్ కార్ల్ పీ స్థాపించిన కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ నుంచి మంగళవారం మొదటి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్(1) లాంచ్ అయింది. ఈ ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ ఇండియాలో రూ.32,999 ధరతో అందుబాటులో ఉంది. మంగళవారం నథింగ్ ఫోన్ (1) లాంచ్ అయిన తర్వాత.. ట్విట్టర్‌లో ‘బాయ్‌కాట్ నథింగ్’, ‘డియర్ నథింగ్’ వంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. వాస్తవానికి ఈ హ్యాష్ ట్యాగ్‌లు బుధవారం అంతా ఇండియాలో ట్విట్టర్‌లో ట్రెండ్ అయిన వాటిల్లో టాప్‌లో ఉన్నాయి. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఈ ప్రచారం ఎలా మొదలైందని? చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
నథింగ్ ఫోన్(1) డిజైన్, స్పెసిఫికేషన్‌లు లేదా ధరతో సంబంధం లేని ఈ హాష్ ట్యాగ్‌లు ప్రధానంగా కార్ల్ పీ స్థాపించిన లండన్ బేస్డ్ టెక్ బ్రాండ్‌పై సౌత్ ఇండియా టెక్ కమ్యూనిటీ నుంచి విమర్శలు వినిపించాయి.
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ Prasadtechintelugu, కొత్తగా లాంచ్ అయిన నథింగ్ ఫోన్(1)కు సంబంధించిన వీడియోను విడుదల చేసిన తర్వాత ‘బాయ్‌కాట్ నథింగ్’, ‘డియర్ నథింగ్’ వంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ వీడియో దక్షిణ భారతదేశంలోని అనేక ఇతర వీడియో క్రియేటర్‌లను రెచ్చగొట్టింది. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో అలాంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవడం ప్రారంభించాయి.
పూర్తిగా ప్రాంక్ చేయడం ఉద్దేశంగా రూపొందించిన ఈ వీడియోలో, యూట్యూబర్ నకిలీ నథింగ్ ఫోన్(1) బాక్స్‌ను అన్‌బాక్స్ చేయడం కనిపించింది. లోపల ఫోన్ లేదు కానీ అందులో.. ‘హాయ్ ప్రసాద్, ఈ డివైజ్ దక్షిణ భారతీయుల కోసం కాదు. ధన్యవాదాలు’ అని రాసి ఉంది. అది కూడా నథింగ్ బ్రాండ్ నేమ్‌ను రాసే చుక్కల ఫాంట్‌లో వాక్యాలు రాసి ఉన్నాయి.
కొద్దిసేపటికే ఆ ఫేక్ లెటర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియా అంతటా వైరల్ అయింది. చాలా మంది వీడియో క్రియేటర్‌లు, వీడియో వెనుక ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. చాలా మంది సృష్టికర్తలు లెటర్‌ను నథింగ్ బ్రాండ్ నుంచి అధికారికంగా వచ్చినట్లు భావించారు. ముఖ్యంగా దేశంలోని లోకల్ కంటెంట్ క్రియేటర్‌లకు నథింగ్ ఫోన్(1) రివ్యూ యూనిట్‌లను అందించనందుకు నిరసనగా ఈ వీడియోను యూట్యూబర్ రూపొందించారు.
నథింగ్‌కు ట్విట్టర్‌లో ఎదురుదెబ్బలు వచ్చిన కొన్ని గంటల తర్వాత, నథింగ్ ఇండియా హెడ్ మను శర్మ ఈ సమస్యను ప్రస్తావిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బ్రాండ్ నథింగ్ ఫోన్ (1) యూనిట్లను దశలవారీగా పంపాలని యోచిస్తోందని, లోకల్ ల్యాంగ్వేజ్ జర్నలిస్టులతో సహా చాలా మంది కంటెంట్ క్రియేటర్‌లు యూనిట్లను అందుకున్నారని శర్మ చెప్పారు. అయినా ఇక్కడ విషయం రివ్యూ యూనిట్ల గురించి కాదని, ఏ డిస్‌క్లైమర్ లేకుండా నకిలీ నథింగ్ బాక్స్ నుంచి తీసిన ఫేక్ లెటర్ గురించి అని శర్మ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: New smart phone, Nothing, Nothing mobile, Twitter