పారిశ్రామికవేత్త కార్ల్ పీ (Carl Pei) స్థాపించిన కన్జ్యూమర్ టెక్నాలజీ కంపెనీ నథింగ్ టెక్నాలజీస్ (Nothing Technologies) ఇప్పటికే చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికే ఇయర్‌బడ్స్ రిలీజ్ చేసిన ఈ కంపెనీ నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లు, నథింగ్ ఓఎస్ ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నథింగ్ కంపెనీ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ (2) (Community Investment (2))గా పిలిచే ఓ కొత్త కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్‌ను అనౌన్స్ చేసింది. ఈ కంపెనీ ఇంతకుముందు ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్ నుంచి 1.5 మిలియన్లను సేకరించింది. ఫస్ట్ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ తరువాత నుంచి నథింగ్ కంపెనీలో చాలా మార్పులు కనిపించాయి. నథింగ్(Nothing) ఇయర్ (1) ట్రూ వైర్‌లెస్ (TWS) ఇయర్‌బడ్స్ లాంచ్ చేయడం నుంచి ఈ కంపెనీలో చాలా మార్పులు వచ్చాయి. ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌పై(Smart Phone) కూడా పని చేస్తోంది. 2022 వేసవిలో నథింగ్ ఫోన్ (1)ని లాంచ్ అవుతుందని కార్ల్ పీ కన్ఫర్మ్ చేశారు.
* కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ (2) నుంచి నథింగ్ ఎంత మనీ సేకరించనుంది?
కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ (2) రౌండ్‌లో భాగంగా 10 మిలియన్ డాలర్లు సేకరించాలని నథింగ్ యోచిస్తోంది. చివరి రౌండ్‌లో కేవలం 54 సెకన్లలో 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేయగలిగామని కంపెనీ పేర్కొంది. కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్‌కు ఇప్పటికే 7 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని.. వెబ్‌సైట్‌లో 70 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ప్రీ-రిజిస్టర్ అయిందని కంపెనీ తెలిపింది.
We want everyone to play a part in Nothing.
As a community-guided company, everyone deserves a chance to share in any potential success. Not in a few of years or if we go public. But now, as our ecosystem begins with phone (1). pic.twitter.com/229m4oyTyG — Nothing (@nothing) April 3, 2022
* ఇంతవరకు నథింగ్ ఎంత మనీ రైజ్ చేసింది?
ఇప్పటివరకు, నథింగ్ 144 మిలియన్ డాలర్లను సేకరించింది. కంపెనీ తన సిరీస్ B ఫండింగ్‌లో భాగంగా ఇటీవల 70 మిలియన్ డాలర్లను రైజ్ చేసింది. సిరీస్ B నిధుల సమీకరణ (Fundraise)కు EQT వెంచర్స్ నాయకత్వం వహించింది. GV (గూగుల్ వెంచర్స్) ఇందులో పాటిస్పేట్ చేసింది.
* నథింగ్‌లో ఎవరు ఇన్వెస్ట్ చేయగలరు?
18 ఏళ్లు నిండిన ఎవరైనా నథింగ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చని కంపెనీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
You've got one day left to register for early access to our second community investment round. Over $70M has been pre-registered so far, and we have an allocation of $10M opening up, so make sure to sign up for early access. https://t.co/O0AofPKig0
— Nothing (@nothing) April 3, 2022
* నథింగ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
నథింగ్‌లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లయితే, మీరు కంపెనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆపై Crowdcube అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తమ ఇంటరెస్ట్ ని ఫ్రీ రిజిస్టర్ చేసుకున్న యూజర్లు భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 5, సాయంత్రం 6:30 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
* నథింగ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఈక్విటీతో పాటు, పెట్టుబడిదారులకు కంపెనీ నుంచి ప్రత్యేకమైన రివార్డులు కూడా లభిస్తాయని నథింగ్ వెల్లడించింది.
* ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
పెట్టుబడిదారులు కనీసం 51.3 డాలర్లు (సుమారు రూ.3,875) పెట్టుబడి పెట్టాలి.
* ఏ డాక్యుమెంట్స్ అవసరం?
పాస్‌పోర్ట్, ఐడెంటిటీ కార్డు, బ్యాంకు స్టేట్‌మెంట్ డాక్యుమెంట్స్ ను పెట్టుబడిదారులు షేర్ చేయాల్సి ఉంటుంది.
* డబ్బులు ఎప్పుడు వసూలు చేస్తారు?
నథింగ్ కంపెనీ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్‌ను పూర్తి చేసిన తర్వాత, అది చెల్లింపు వివరాలతో ఈ-మెయిల్‌ను షేర్ చేస్తుంది. ఆపై మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ రిక్వెస్ట్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.
* పెట్టుబడిదారులకు బోర్డు సీటు వస్తుందా?
బోర్డు సమావేశాలలో కమ్యూనిటీ వాయిస్‌కి ప్రాతినిధ్యం వహించడానికి ఈ యూజర్ల కమ్యూనిటీ నుంచి ఒక బోర్డు సభ్యుడిని కంపెనీ ఎన్నుకుంటుందని నథింగ్ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.