హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nothing Ear Stick: నథింగ్ ఇయర్ స్టిక్ సేల్ ప్రారంభం... లిప్‌స్టిక్ లాంటి ఇయర్‌బడ్స్‌ ప్రత్యేకతలు తెలుసుకోండి

Nothing Ear Stick: నథింగ్ ఇయర్ స్టిక్ సేల్ ప్రారంభం... లిప్‌స్టిక్ లాంటి ఇయర్‌బడ్స్‌ ప్రత్యేకతలు తెలుసుకోండి

Nothing Ear Stick: నథింగ్ ఇయర్ స్టిక్ సేల్ ప్రారంభం... లిప్‌స్టిక్ లాంటి ఇయర్‌బడ్స్‌ ప్రత్యేకతలు తెలుసుకోండి
(image: Nothing)

Nothing Ear Stick: నథింగ్ ఇయర్ స్టిక్ సేల్ ప్రారంభం... లిప్‌స్టిక్ లాంటి ఇయర్‌బడ్స్‌ ప్రత్యేకతలు తెలుసుకోండి (image: Nothing)

Nothing Ear Stick | నథింగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఇయర్ స్టిక్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ ఇయర్‌స్టిక్ లిప్‌స్టిక్‌లా కనిపిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రెండేళ్ల క్రితం పరిచయమైన టెక్ బ్రాండ్ నథింగ్ నుంచి ఇటీవల మరో ప్రొడక్ట్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. లిప్‌స్టిక్‌లా ఉండే ఇయర్ స్టిక్‌‌ను (Ear Stick) లాంఛ్ చేసింది నథింగ్. ఈ కంపెనీ నుంచి వచ్చిన మూడో ప్రొడక్ట్ ఇది. గతంలో నథింగ్ ఇయర్ 1 (Nothing Ear 1), నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) లాంఛ్ అయ్యాయి. లేటెస్ట్‌గా నథింగ్ ఇయర్ స్టిక్ (Nothing Ear Stick) వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమైంది. నథింగ్ ఇయర్ స్టిక్ ధర రూ.8,499. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్ కూడా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. రూ.2,833 ఈఎంఐతో నథింగ్ ఇయర్ స్టిక్ కొనొచ్చు.

నథింగ్ ఇయర్ స్టిక్ ఫీచర్స్ ఇవే...

నథింగ్ ట్రాన్స్‌పరెంట్ ప్రొడక్ట్స్‌తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. నథింగ్ ఇయర్ 1, నథింగ్ ఫోన్ 1 ఇలాగే వచ్చాయి. నథింగ్ ఇయర్ స్టిక్‌ను కూడా ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో తీసుకొచ్చింది కంపెనీ. ఇది చూడ్డానికి లిప్‌స్టిక్‌లా ఉంటుంది. ట్విస్ట్ చేసి కేస్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నథింగ్ ఇయర్ స్టిక్ ఈ కంపెనీ నుంచి వచ్చిన రెండో ఆడియో ప్రొడక్ట్. హాఫ్ ఇన్ ఇయర్ డిజైన్‌తో ఈ ఇయర్ బడ్స్‌ని తయారు చేసింది కంపెనీ. ఇందులో 12.6 మిమీ డ్రైవర్లు ఉన్నాయి.

Whatsapp Polls Feature: వాట్సప్‌లో పోల్స్ ఫీచర్ వచ్చేసింది... పోల్ ఇలా క్రియేట్ చేయాలి

నథింగ్ ఇయర్ స్టిక్ కేస్‌లో 350mAh బ్యాటరీ, ఒక్కో ఇయర్‌బడ్‌లో 36mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో మొత్తం 29 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ కేస్‌ను 10 నిమిషాలు ఛార్జింగ్‌ చేస్తే 2 గంటల పాటు వాడుకోవచ్చు. టైప్ సీ పోర్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. IP54 రేటింగ్ ఉంది. వాటర్ ప్రూఫ్, స్వేట్‌ ప్రూఫ్ ప్రొటెక్షన్ లభిస్తుంది.

కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు ఉపయోగించుకోవచ్చు. గెస్చర్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఆడియో ప్లే, ఆడియో పాజ్, వాల్యూమ్ కంట్రోల్, కాల్స్‌, వాయిస్ అసిస్టెంట్ కోసం ఈ ఫీచర్ వాడుకోవచ్చు.

30 Days Validity: జియో , ఎయిర్‌టెల్ , Vi యూజర్లకు 30 రోజుల వేలిడిటీ ప్లాన్స్ ఇవే

నథింగ్ ఇయర్ స్టిక్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ లేదు. క్లియర్ వాయిస్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది నథింగ్. పెయిర్ చేసినప్పుడు EQ సెట్టింగ్స్‌ అడ్జస్ట్‌మెంట్‌, ఫైండ్ మై ఇయర్‌బడ్స్ ఫంక్షన్‌ లాంటి స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. నథింగ్ X యాప్ ద్వారా ఇయర్ స్టిక్ ఆపరేట్ చేయొచ్చు.

First published:

Tags: Earbuds, Nothing

ఉత్తమ కథలు