ఈ రోజుల్లో వైర్స్ లేని ఇయర్ఫోన్స్కి (Ear Phones) డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది. వర్కౌట్స్ చేసేటప్పుడు ఈ ఇయర్‌ఫోన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ సమయంలోనైనా వీటిని ధరించవచ్చు. అందుకే వీటికి ఇంత డిమాండ్! అయితే ఇండియాలో ఇప్పటికే చాలా ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ (TWS) అందుబాటులోకి వచ్చి వినియోగదారులను ఆకట్టుకున్నాయి. కాగా కొత్త టెక్ కంపెనీ నథింగ్ (Nothing) కూడా ఇండియన్ యూజర్స్‌ని ఆకట్టుకునేందుకు నథింగ్ ఇయర్ స్టిక్ (Nothing Ear Stick)ని గత నెలలో లాంచ్ చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఇండియాలో ఈ ఆడియో ప్రొడక్ట్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.
లాంచ్ సమయంలో, ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ప్రొడక్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.1,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇయర్ (స్టిక్) మొదటి సేల్ నవంబర్ 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నవంబర్ 17 నుంచి సాధారణ సేల్ ప్రారంభమవుతుంది. ఈ రెండు సేల్స్‌లో నథింగ్ ప్రొడక్ట్ ఉన్నవారు రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. రూ.8,499 ధరతో లాంచ్ అయిన నథింగ్ ఇయర్ (స్టిక్) పదివేల లోపు TWS ఇయర్‌బడ్స్‌లో బెస్ట్ ఛాయిస్ అవుతుందా.. వీటి డిజైన్, పర్ఫామెన్స్ ఎలా ఉందనేది చూద్దాం.
ఇలాంటి టీవీని మీరెప్పుడూ చూసి ఉండరు.. ధర రూ.4 వేలే, దీనికో ప్రపంచ రికార్డ్!
నథింగ్ ఇయర్ (స్టిక్) ఒక్కో బడ్లో ఒక్కో 12.6mm డైనమిక్ డ్రైవర్ అందించారు. ఇప్పటివరకు రివ్యూలు చేసిన వారి ప్రకారం, నథింగ్ ఇయర్ (స్టిక్)లో కాల్స్ క్లియర్‌గా వినిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వంటి సమస్యలు ఉండవు. ఈ బడ్స్ నథింగ్స్ క్లియర్ వాయిస్ టెక్నాలజీతో వస్తాయి. ఈ టెక్నాలజీలో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ఫిల్టర్ చేయడానికి మూడు హై-డెఫినిషన్ మైక్స్ అప్డేటెడ్ అల్గారిథమ్‌లతో కలిసి పని చేస్తాయి. నథింగ్ ఇయర్ (స్టిక్) కొత్త నథింగ్ ఎక్స్ యాప్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ , iOS యూజర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్ బ్లూటూత్ 5.2 ద్వారా SBC, AAC కోడెక్‌లకు సపోర్ట్ ఆఫర్ చేస్తుంది. ఇయర్ (స్టిక్) కనెక్టివిటీ పర్ఫామెన్స్ చాలా వరకు బాగానే ఉంది. గూగుల్ ఫాస్ట్ పెయిర్ టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ టెక్నాలజీకి ఈ ఇయర్‌బడ్స్ సపోర్ట్ చేస్తాయి.
స్టన్నింగ్ డీల్.. 55 అంగుళాల స్మార్ట్ టీవీపై రూ.17 వేల డిస్కౌంట్!
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్ (స్టిక్) సులభంగా ఒక రోజు బ్యాకప్ అందిస్తుంది. రివ్యూల సమయంలో ఈ ఇయర్‌బడ్స్ ఏడు గంటల వరకు మ్యూజిక్ వినడానికి, మూడు గంటల ఫోన్ మాట్లాడడానికి సరిపడా బ్యాకప్ అందించాయి. కేస్ 20 గంటల వరకు ఛార్జ్ ప్యాక్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా కంపెనీ చెప్పినట్లే ఈ ప్రొడక్ట్ బ్యాకప్ అందించింది. పదేపదే ఛార్జింగ్ పెట్టడం కుదరని లేదా నచ్చని వారికి ఇదొక బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
నథింగ్ ఇయర్ (స్టిక్) లిప్‌స్టిక్ షేప్ కేస్‌తో వస్తుంది. USB-C అడాప్టర్లతో కేస్ ఛార్జ్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వదు. హాఫ్ ఇన్-ఇయర్ స్టైల్ బడ్స్‌తో ఈ ప్రొడక్ట్ ధరించినప్పుడు కింద పడిపోతుందని భయం కలగదు. టచ్ కంట్రోల్స్ కూడా వీటిలో ఎక్కువగానే ఉన్నాయి. బడ్స్‌పై సింగిల్ ప్రెస్ చేస్తే ప్లే/పాజ్, ఆన్సర్/హాంగ్ అప్ కాల్స్; రెండుసార్లు ప్రెస్ చేస్తే: ఫార్వార్డ్ సాంగ్, కాల్స్ రిజెక్షన్; ట్రిపుల్ ప్రెస్: స్కిప్ బ్యాక్, ప్రెస్ & హోల్డ్ (లెఫ్ట్ ఇయర్‌బడ్): వాల్యూమ్ డౌన్.. ప్రెస్ & హోల్డ్ (కుడి ఇయర్‌బడ్): వాల్యూమ్ అప్ వంటి ఫంక్షన్స్ ఉన్నాయి.
మొత్తంమీద, నథింగ్ ఇయర్ (స్టిక్) మంచి బ్యాటరీ లైఫ్, బెస్ట్ డిజైన్, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ కాల్ క్వాలిటీతో వస్తుంది. పైన చెప్పిన పాయింట్స్ ఆధారంగా రూ.10 వేలలోపు బడ్స్ కొనాలనుకునేవారు దీన్ని తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ear phones, Earbuds, Nothing, Nothing mobile