హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nothing Ear Stick: నవంబర్ 17న ఇండియాలో నథింగ్ ఇయర్ స్టిక్ లాంచ్.. వారికి స్పెషల్‌ ఆఫర్‌..

Nothing Ear Stick: నవంబర్ 17న ఇండియాలో నథింగ్ ఇయర్ స్టిక్ లాంచ్.. వారికి స్పెషల్‌ ఆఫర్‌..

Nothing Ear Stick: నవంబర్ 17న ఇండియాలో  నథింగ్ ఇయర్ స్టిక్ లాంచ్.. వారికి స్పెషల్‌ ఆఫర్‌..

Nothing Ear Stick: నవంబర్ 17న ఇండియాలో నథింగ్ ఇయర్ స్టిక్ లాంచ్.. వారికి స్పెషల్‌ ఆఫర్‌..

నథింగ్ ఫోన్(1) స్మార్ట్‌ఫోన్‌ జులై 12న ఇండియన్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. సరికొత్త డిజైన్‌తో ఈఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకుంది. ఇప్పుడు నథింగ్‌ కంపెనీ తమ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం సూపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

నథింగ్ ఫోన్(1) స్మార్ట్‌ఫోన్‌ జులై 12న ఇండియన్‌ మార్కెట్‌లోకి(Indian Market) అడుగు పెట్టింది. సరికొత్త డిజైన్‌తో ఈఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకుంది. ఇప్పుడు నథింగ్‌ కంపెనీ తమ స్మార్ట్‌ఫోన్(Smartphone) యూజర్ల కోసం సూపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. నథింగ్ ఇయర్ స్టిక్‌ను నవంబర్ 17న ఇండియన్‌ మార్కెట్‌లోకి లాంచ్ చేయనుంది. ఈ ఇయర్ స్టిక్ యూకే, అమెరికా, యూరప్‌ సహా 40 దేశాలలో నేడు నవంబర్‌ 5 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ఇయర్ స్టిక్‌ను లాంచ్(Ear Stick Launch) కంటే ముందే సొంతం చేసుకొనే అవకాశాన్ని కంపెనీ ఇండియన్‌ కస్టమర్లకు కల్పిస్తోంది. నథింగ్ స్మార్ట్ ఫోన్ లేదా నథింగ్ ఇయర్ 1 ఉన్న కస్టమర్లు నథింగ్ ఇయర్ స్టిక్‌ను నవంబర్ 14న ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. పైగా ఈ ప్రొడక్ట్‌పై రూ.1000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ & జనరల్ మేనేజర్ మను శర్మ ప్రకటించారు.

నథింగ్ ఇయర్ స్టిక్ ఫీచర్స్

నథింగ్ ఇయర్ (స్టిక్) ఇయర్‌బడ్స్‌తో 7 గంటల లిజనింగ్ టైమ్, 3 గంటల టాక్ టైమ్‌ను అందిస్తుంది. ఇందులో 12.6 మిమీ కస్టమ్ డ్రైవర్‌ ఉంటుంది. నథింగ్ ఇయర్ స్టిక్ ప్రతి ఇయర్‌బడ్‌కు 4.4గ్రా బరువు ఉంటుంది. ఇది బాస్ లాక్ టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్ టెక్నాలజీ యూజర్లు ఈ ఇయర్ స్టిక్‌ను యూజ్ చేసినప్పుడు ఇయర్ కెనాల్ షేప్, ఇయర్‌బడ్‌ల ఫిట్‌‌ను మెజర్ చేస్తుంది. అలాగే ఎంత బాస్ కోల్పోయిందో గుర్తిస్తుంది.

అంతేకాకుండా ఇది ఈక్వలైజర్‌ను ఆటోమెటిక్‌గా ఆప్టిమల్ లెవల్‌కు అడ్జస్ట్‌ చేస్తుంది. ఇయర్ (స్టిక్) ప్రెస్ కంట్రోల్స్ ప్రతి ఇయర్‌బడ్‌పై ఉంటాయి. చేతి వేళ్లు తడిగా ఉన్నప్పటికీ అవి పని చేస్తాయి. ఈ ప్రెస్ కంట్రోల్స్ ద్వారా యూజర్లు ప్లే చేయడానికి, పాజ్ చేయడానికి, ట్రాక్‌లను దాటవేయడానికి, వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడానికి, వాల్యూమ్‌ని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇయర్ స్టిక్ ధర రూ.8,499.

Non Teaching Posts: 10/10+2, డిగ్రీ అర్హత.. జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ పోస్టులు ఖాళీ..

నథింగ్ ప్రొడక్ట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే ఆఫర్..

నథింగ్‌ కస్టమర్లు ఇయర్ (స్టిక్)ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. నథింగ్ ప్రొడక్ట్ ఉన్న కస్టమర్లు ఎవరైనా ఈ ఇయర్ స్టిక్‌ను రూ.1000 డిస్కౌంట్‌‌తో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 14న 12PM సమయంలో వినియోగించుకోవచ్చు. ఆఫర్ పరిమిత కాల వ్యవధి వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రొడక్ట్‌ను నవంబర్ 17న 12 PM నుంచి ఎప్పుడైనా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.

* ఆ దేశాల్లో నేటి నుంచి అమ్మకాలు

నథింగ్ ప్రొడక్ట్ ఉన్న కస్టమర్లు నవంబర్ 17 విక్రయ తేదీకి మూడు రోజుల ముందు అంటే.. నవంబర్ 14న నథింగ్ ఇయర్ (స్టిక్)ను కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ లిమిటెడ్-టైమ్ ఆఫర్ అయినప్పటికీ, నవంబర్ 17 తరువాత ఈ ప్రొడక్ట్ అందుబాటులోకి రానుంది. భారత్‌లో మాత్రం నవంబర్ 17 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్ , మింత్ర(Myntra)లో మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించారు.

First published:

Tags: Ear stick, Nothing, Technology

ఉత్తమ కథలు