Nothing Earbuds | మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే కళ్లుచెదిరే డీల్ ఒకటి అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ (Phone) కొనుగోలు చేస్తే.. ఇయర్ బడ్స్ ఉచితంగా లభిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది. అందువల్ల కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను ఇప్పుడు సొంతం చేసుకోవచ్చు. లేదంటే ఇయర్ బడ్స్ (Earbuds) మిస్ అయిపోతారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా చాలా టెక్ కంపెనీలు ఇప్పటికే వివిధ రకాల ఆఫర్లు తీసుకువచ్చాయి. ఇప్పుడు మరో కంపెనీ కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. టెక్ కంపెనీ నథింగ్ బంపర్ డిస్కౌంట్ తీసుకువచ్చింది. స్మార్ట్‌ఫోన్స్, టీడబ్ల్యూఎస్ బడ్స్‌పై ఆఫర్లు లభిస్తున్నాయి. కంపెనీ నథింగ్ ఫోన్ 1 ను మాత్రమే కస్టమర్లకు అందిస్తోంది. ఈ ఫోన్ ఆరంభం నుంచి కస్టమర్లలో కొనుగోలు ఆసక్తిని పెంచుతూ వచ్చింది. చాలా మంది ఇప్పటికే ఈ ఫోన్ కొనుగోలు చేశారు. ఇప్పుడు మీరు ఈ ఫోన్ కొంటే ఉచితంగా నథింగ్ ఇయర్ స్టిక్ బడ్స్ పొందొచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో మాత్రమే ఈ డీల్ అందుబాటులో ఉంది.
స్మార్ట్‌టీవీపై రూ.299 ఈఎంఐ ఆఫర్.. రూ.37 వేల టీవీ రూ.8 వేలకే కొనండి!
అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరే ఆఫర్ ఉంది. నథింగ్ ఫోన్ 1ను రూ. 26,999కే కొనొచ్చు. దీని ఎంఆర్‌పీ రూ. 37,999. అంటే మీకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై 28 శాతం తగ్గింపు ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అలాగే 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 27,999గా ఉంది. దీని ఎంఆర్‌పీ రూ. 39,999గా ఉంది. అంటే మీకు 30 శాతం డిస్కౌంట్ ఉంది.
రూ.12 వేల బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ రూ.1,999కే.. భారీ డిస్కౌంట్ ఆఫర్!
Love is in the pair. This Valentine's season we’re gifting Ear (stick) with every purchase of Phone (1). All yours on https://t.co/pLWW07l8G7 and at Nothing Store Soho. pic.twitter.com/E59sAgPXYc
— Nothing (@nothing) February 3, 2023
ఇక 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 35,999గా ఉంది. దీని ఎంఆర్‌పీ రూ. 42,999. అంటే మీకు 16 శాతం తగ్గింపు ఉంది. ఈ ఆఫర్లు ఫిబ్రవరి 15 వరకే ఉంటాయి. ఇకపోతే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.55 ఇంచుల డిస్‌ప్లే, 50 ఎంపీ + 50 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778 జీ ప్లస్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇకపోతే నథింగ్ ఇయర్ స్టిక్ ఎంఆర్‌పీ రూ. 9,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు డిస్కౌంట్‌లో కొనొచ్చు. మీరు రూ. 6,999కే ఈ ఇయర్ స్టిక్ కొనొచ్చు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 13 వరకే అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డిస్కౌంట్ ధరకే దీన్ని కొనుగోలు చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Flipkart offers, Nothing, Nothing mobile, Smartphone