టెక్ బ్రాండ్ నథింగ్ నుంచి మార్కెట్లోకి వచ్చిన ప్రొడక్ట్స్ కొన్నే అయినా.. వీటికి డిమాండ్ మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుంది. నథింగ్ ఫోన్ (1)తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కంపెనీ, ఆడియో ప్రొడక్ట్స్ మార్కెట్ విస్తరణపై కూడా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నథింగ్ ఇయర్ (2) [Nothing Ear (2)] పేరుతో సరికొత్త TWS ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.
నథింగ్ ఇయర్ (2) ప్రొడక్ట్, గతంలో కంపెనీ నుంచి వచ్చిన ఇయర్ (1) బడ్స్‌కు సక్సెసర్‌గా వచ్చింది. మంచి స్పెసిఫికేషన్లతో రూపొందిన ఈ ప్రీమియం ప్రొడక్ట్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ కెపాసిటీని మెరుగుపరిచారు. కానీ డిజైన్ పరంగా ఓల్డ్ ప్రొడక్ట్‌తో పోలిస్తే పెద్దగా మార్పులు లేవు. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పాత మోడల్‌లో కొన్ని మార్పులు చేసి అప్‌డేటెడ్ ఇయర్ (2) బడ్స్ తయారు చేసినట్లు కంపెనీ చెబుతోంది.
* డిజైన్, ఫీచర్లు
నథింగ్ ఇయర్ (1) బడ్స్ కేస్ కాస్త పెద్దగా ఉంటుంది. అయితే ఇయర్ (2) కేస్‌ను చిన్నదిగా, తేలికగా మార్చినట్లు కంపెనీ చెబుతోంది. ఆడియో సొంత కస్టమ్ 11.6mm డ్రైవర్స్‌ను వీటిలో ఉపయోగించింది. ఇవి రిచ్ ఆడియో క్వాలిటీని, మ్యూజిక్‌కు ఎక్స్‌ట్రా బాస్ అందిస్తాయి. హై క్వాలిటీ ఆడియో స్ట్రీమింగ్ కోసం ఈ ప్రీమియం ప్రొడక్ట్ LHDC కోడెక్‌కు కంపాటబుల్‌గా ఉంటుంది. ఇది బెస్ట్ కనెక్టివిటీని అందిస్తుంది.
ఇది కూడా చదవండి : రూ.7,999 స్మార్ట్‌వాచ్ కేవలం రూ.99కే.. అమెజాన్‌లో కళ్లుచెదిరే ఆఫర్!
ఈ TWS ఇయర్‌బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ను కంపెనీ అందించింది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆటోమెటిక్‌గా యాంబియెంట్ సౌండ్‌ను జనరేట్ చేస్తుంది. మల్టీ డివైస్ పెయిరింగ్ అనేది ఈ ఇయర్‌బడ్స్ మరొక అప్‌గ్రేడ్. చాలా సింపుల్‌గా ఈ డివైజ్‌ను ఫోన్, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు స్విచ్ కావచ్చు.
* బ్యాటరీ స్పెసిఫికేషన్స్
ఈ లేటెస్ట్ ఇయర్‌బడ్స్‌లో కంపెనీ పెద్ద బ్యాటరీని అందించింది. ఇయర్ (2) కేస్‌ను 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే.. 8 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఈ బడ్స్‌లో 33mAh బ్యాటరీ ఉంటుంది. కేస్‌లో 485mAh యూనిట్ ఉంది. నథింగ్ ఇయర్ (2) బడ్స్‌ను వైర్‌లెస్‌గా కూడా ఛార్జ్ చేయవచ్చు.
* ధర ఎంత?
నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్స్ ధర ఇండియాలో రూ.9,999 గా ఉంది. మార్చి 22 నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో దీన్ని బుకింగ్ చేసుకోవచ్చు. ఇండియాలో నథింగ్ ఇయర్ (2) సేల్స్ మార్చి 28 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్ , మింత్ర ఆన్‌లైన్ పోర్టల్స్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లలో కూడా ఇది అందుబాటులోకి రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.