Nothing Ear 1: నథింగ్ ఇయర్ 1 ఇయర్‌బడ్స్ వచ్చేశాయి... ఫీచర్స్ ఇవే

Nothing Ear 1: నథింగ్ ఇయర్ 1 ఇయర్‌బడ్స్ వచ్చేశాయి... ఫీచర్స్ ఇవే

Nothing Ear 1 | నథింగ్ బ్రాండ్ నుంచి తొలి ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లాంఛ్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
వన్​ప్లస్​ మాజీ సీఈఓ బ్రాండ్​ నథింగ్ నుంచి ఇయర్ (1) టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్​ విడుదలయ్యాయి. బ్రిటన్‌కు చెందిన ఈ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ నుంచి భారత్​లో విడుదలైన మొట్టమొదటి ఇయర్​బడ్స్​ ఇవే కావడం గమనార్హం. వీటిని మాజీ వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ కార్ల్ పీ ఆవిష్కరించారు. నథింగ్​ నుంచి బడ్జెట్​ ధరలోనే ప్రీమియం ఇయర్​ఫోన్లను విడుదల చేస్తున్నారు. తద్వారా వీటికి గ్లోబల్​ మార్కెట్​లో మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా విడుదలైన ఇయర్​బడ్స్​లో యాక్టివ్​ నాయిస్​ క్యాన్సిలేషన్​, వైర్​లెస్​ చార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లను అందించారు. ఈ ఇయర్​ఫోన్స్​, దాని కేసును హై క్వాలిటీతో రూపొందించారు.

నథింగ్ ఇయర్ (1) ధర


భారతదేశంలో నథింగ్ ఇయర్ (1) ఇయర్​బడ్స్​ను రూ. 5,999 ధర వద్ద విడుదల చేసింది. గ్లోబల్​ మార్కెట్​లో కంటే వీటి ధర భారత్​లోనే తక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. గ్లోబల్​ మార్కెట్​లో ఇవి EUR 99 (సుమారు రూ .8,700) ధర వద్ద లభిస్తాయని పేర్కొంది. భారత దేశంలో ఈ ధర వద్ద లభిస్తున్న ఒప్పో రియల్​మీ బ్రాండ్లకు చెందిన ఇయర్​బడ్స్​కు నథింగ్​ ఇయర్​ (1) గట్టి పోటీనివ్వనుంది. వీటిని ఆగస్ట్​ 17 నుంచి ఫ్లిప్​కార్ట్​ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Vivo V19: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి

iQoo Z3 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... రూ.3,500 తగ్గింపు

స్పెసిఫికేషన్లు


స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, నథింగ్ ఇయర్ (1) ఇయర్‌బడ్స్‌లో 11.6 డైనమిక్ డ్రైవర్లను అందించింది. ప్రస్తుతం మార్కెట్​లో లభిస్తున్న చాలా టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్‌ కంటే వీటిలో మెరుగైన ఫీచర్లను చేర్చింది. ఇవి ANC సపోర్ట్​తో వస్తాయి. ఆండ్రాయిడ్​, యాపిల్​ స్మార్ట్‌ఫోన్‌లతో నేరుగా కనెక్ట్​ చేసుకునేందుకు వీటిలో బ్లూటూత్ v5.2 ని అందించారు. ఇక, ANC లెవల్స్​ను అడ్జెస్ట్ చేసేందుకు వీటిలో రెండు మోడ్‌లను కూడా చేర్చింది. ‘లైట్ మోడ్’ మోడరేట్​ నాయిస్​ క్యాన్సిలేషన్, ‘మ్యాగ్జిమం మోడ్’ 40dB వరకు సౌండ్​ను ఫిల్టర్ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది.

Oppo F17: ఒప్పో ఎఫ్17 స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 తగ్గింపు... ఆఫర్ వివరాలు ఇవే

Airtel Plans: రూ.299 నుంచి ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ తెలుసుకోండి

స్పష్టమైన ఆడియో కోసం వీటిలో వాయిస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సెట్టింగ్స్​ను అడ్జెస్ట్​ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఇయర్​ 1 యాప్​ను కూడా రూపొందించింది. దీన్ని గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వేస్తే.. ఈ ఇయర్​పీస్​లను ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే.. 5 గంటల 7 నిమిషాల బ్యాటరీ బ్యాకప్​ అందిస్తాయి. అదే సమయంలో, ఈ కేసు మొత్తం 34 గంటల బ్యాకప్​తో వస్తుంది. యూఎస్​బీ టైప్​–సి ద్వారా వేగంగా ఛార్జింగ్​ చేయడం ద్వారా 10 నిమిషాల ఛార్జ్​తో 8 గంటల ప్లేబ్యాక్​ను పొందవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: