Home /News /technology /

Nothing ear 1: నథింగ్ ఇయర్ 1 బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది... బిట్‌కాయిన్‌తో కూడా కొనొచ్చు

Nothing ear 1: నథింగ్ ఇయర్ 1 బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది... బిట్‌కాయిన్‌తో కూడా కొనొచ్చు

Nothing ear 1: నథింగ్ ఇయర్ 1 బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది... బిట్‌కాయిన్‌తో కూడా కొనొచ్చు
(image: Nothing)

Nothing ear 1: నథింగ్ ఇయర్ 1 బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది... బిట్‌కాయిన్‌తో కూడా కొనొచ్చు (image: Nothing)

Nothing ear 1 | లేటెస్ట్ టెక్ బ్రాండ్ అయిన నథింగ్ (Nothing) నుంచి ఇయర్ 1 పేరుతో ఇయర్‌బడ్స్ గతంలో లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్లాక్ కలర్‌లో కొత్త ఎడిషన్ వచ్చింది. ఎలా ఉందో తెలుసుకోండి.

నథింగ్ కంపెనీ నుంచి వరుసగా ఇయర్‌బడ్స్​ లాంచ్​ అవుతున్నాయి. నథింగ్​ సంస్థ (Nothing) తాజాగా ఇయర్ (1) బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్​ను భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. ఈ టీడబ్ల్యూఎస్​ ఇయర్ బడ్స్​ నలుపు రంగులో అద్భుతంగా కనిపిస్తాయి. ఒరిజినల్ ఇయర్ (1) లాగానే, కొత్త బ్లాక్ ఎడిషన్ కూడా ట్రాన్స్​పరెంట్​ డిజైన్‌తో వస్తాయి. గతంలో విడుదలైన ఒరిజినల్ నథింగ్​ ఇయర్​బడ్స్​ వైట్ కలర్​లో మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు, విడుదలైన ఇయర్ (1) బ్లాక్ ఎడిషన్ మాత్రం స్మోకీ ఫినిషింగ్, మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఈ నథింగ్ ఇయర్ (1) ఇయర్​బడ్స్​ భారతదేశంలో రూ. 6,999 వద్ద అందుబాటులో ఉంటుంది. మీరు దీన్ని డిసెంబర్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన దేశాల్లో ఈ నంథింగ్​ ఇయర్​ (1) బ్లాక్​ ఎడిషన్​ ఇయర్​బడ్స్​ను బిట్‌కాయిన్, ఎథెరియం (ETH), యూఎస్​డీ కాయిన్ (USDC), డోజీకాయిన్​ (DOGE)తో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ అవకాశం భారతదేశంలో మాత్రం అందుబాటులో లేదు.

Jio 1.5GB Data plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే


కొత్త ఇయర్ బడ్స్ ప్రత్యేకతలు


కొత్తగా వచ్చిన నథింగ్​ ఇయర్ (1) బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్‌లో కలర్ ఆప్షన్ మినహా ఎటువంటి మార్పులు లేవని కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ, మీరు నలుపు రంగును ఇష్టపడే వారైతే, కొత్త ఇయర్ (1) బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ మీకు బెస్ట్ ఆప్షన్​గా చెప్పవచ్చు. నథింగ్ ఇయర్ (1) బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్‌లో కేవలం 4.7 గ్రాముల బరువుండే అల్ట్రాలైట్ ఇయర్‌బడ్స్ ఉంటాయి. ఈ ఇయర్​బడ్స్​​ 11.6mm స్పీకర్ డ్రైవర్‌తో వస్తాయి. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు మద్దతిస్తాయి. వీటిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్​ చేస్తే 5 గంటల వరకు ప్లేబ్యాక్​ను అందిస్తాయి. ఒకవేళ, ఛార్జింగ్ కేస్‌లో పెట్టి ఉపయోగించుకుంటే 34 గంటల వరకు ప్లేబ్యాక్​ను అందిస్తాయి. ఈ ఛార్జింగ్​ కేస్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతిస్తుంది.

Mi 4A Pro: రూ.19,999 విలువైన ఈ స్మార్ట్ టీవీని రూ.4,999 ధరకే కొనండి ఇలా

యాప్ ద్వారా కనెక్టివిటీ ఆప్షన్


నథింగ్ ఇయర్ (1) బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ IPX4 స్వెట్​, వాటర్​ రెసిస్టెన్స్ సపోర్ట్​తో వస్తాయి. నథింగ్​ యాప్​ ద్వారా ఇయర్​బడ్స్​ను కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకే, వీటిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌తో అందుబాటులోకి తెచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన నథింగ్ ఇయర్ (1), నథింగ్ సంస్థ నుంచి వచ్చిన మొదటి ప్రొడక్ట్. ప్రత్యేకమైన ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో ఇది కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. కొత్త వెర్షన్ సైతం కళ్లు చెదిరేలా ఉందని ఇయర్‌బడ్స్ లవర్స్ చర్చించుకుంటున్నారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Earbuds, Nothing

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు