మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న నథింగ్ బ్రాండ్(Nothing Brand).. మరో లాంచ్ ఈవెంట్‌కు (Event) సిద్ధమైంది. ఈ నెల 23న జరగబోతున్న ఈ ఈవెంట్‌పై టెక్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు కస్టమర్లు దృష్టి పెట్టారు. ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌తో(Wire Less Ear Buds) సెన్సేషన్ క్రియేట్ చేసిన నథింగ్ బ్రాండ్.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. క్వాల్‌కామ్‌తో కలిసి వన్‌ప్లస్‌కు పోటీగా మొబైల్స్ దించే పనిలో పడింది. ఈ నెల 23న జరగబోయే ఈవెంట్‌కు 'ది ట్రూత్'(The Truth) అని పేరు పెట్టారు. ఈ ఈవెంట్ కోసం ఆన్‌లైన్‌లో(Online) సైన్‌అప్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్‌లో నథింగ్.. తన లేటెస్ట్ బ్రాండ్ న్యూ స్మార్ట్ ఫోన్‌ను(Smart Phone) లాంచ్ చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ స్మార్ట్ ఫోన్ లాంచ్‌ను వాయిదా వేసినట్లయితే మరేదైనా పవర్ బ్యాంక్(Power Bank) లాంటి ప్రొడక్ట్‌ను లాంచ్ చేయొచ్చు. నథింగ్ బ్రాండ్ ప్రస్తుతానికి ఐదు ప్రొడక్ట్స్‌ను డెవలప్ చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
నథింగ్ బ్రాండ్‌కు ఇంత పాపులారిటీ రావడానికి ముఖ్యకారణం సంస్థ వ్యవస్థాపకుడు కార్ల్. కార్ల్ ఒకప్పుడు వన్‌ప్లస్‌కు కో ఫౌండర్ గా ఉన్నానే. బిజినెస్ వర్గాలతో పాటు.. టెక్ అంశాల మీద పట్టున్న కార్ల్ .. వన్‌ప్లస్ కంపెనీ సక్సెస్‌లో కీ రోల్ పోషించాడు. అలాంటి కార్ల్.. వన్‌ప్లస్ నుంచి బయటకు వచ్చి, సొంతంగా నథింగ్ పేరుతో కంపెనీ పెట్టి అంచనాలు సృష్టించాడు.
ఇంతకీ మీరేం తయారు చేయబోతున్నారన్న ప్రశ్నకు ‘మేం ప్రతి విషయాన్ని పునరాలోచిస్తున్నాం. ఏం తయారు చేయాలి? ఎలా తయారు చేయాలి? కొత్తగా ఏం రాబోతోంది? ఏం వెళ్లిపోనుంది? లాంటివెన్నో ఆలోచిస్తున్నాం. సరికొత్త ఆవిష్కరణ కోసం భారీ రీసెట్ బటన్ ఇది’ అంటూ తన నథింగ్ బ్రాండ్ గురించి చెప్పుకొచ్చారు కార్ల్. పేరుకు తగ్గట్లే.. ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ కూడా భిన్నంగా ఉంటాయన్న టాక్ మార్కెట్లో వినిపిస్తుంది.
రీసెంట్ గా నథింగ్ నుంచి నథింగ్ ఇయర్ 1 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ రిలీజ్ అయ్యాయి. లేటెస్ట్ ఫీచర్స్‌తో ఈ ఇయర్ బడ్స్ మంచి రీవ్యూలు అందుకున్నాయి. వీటి ధర రూ.5,999. ఇందులో యాక్టీవ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌ను లైట్ మోడ్, మ్యాగ్జిమమ్ మోడ్‌లో ఉపయోగించుకోవచ్చు. యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో ఉన్న ట్రాన్స్‌పరెంట్ మోడ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. నథింగ్ ఇయర్ బడ్స్‌లో 11.6 ఎంఎం ఎయిర్ ఛాంబర్‌తో డైనమిక్ డ్రైవర్స్ వాడారు. బ్లూటూత్ 5.2 సపోర్ట్‌తో ఈ ఇయర్‌బడ్స్ పనిచేస్తాయి.
ఇవి ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో పాటు 4.7 గ్రాముల లైట్ వెయిట్‌తో ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లున్నాయి. 8 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 5 నుంచి 7 గంటల ప్లే బ్యాక్ టైం ఉంటుంది. స్పష్టమైన ఆడియో కోసం వీటిలో వాయిస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సెట్టింగ్స్‌ను అడ్జెస్ట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఇయర్ 1 యాప్‌ను కూడా రూపొందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.