Nothing CEO : నథింగ్ బ్రాండ్(Nothing Brand)కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్, డిజైన్లు అందించి వినియోగదారులను ఆకట్టుకుంది. నథింగ్ కంపెనీ దాని మొదటి డివైజ్ ఇయర్(1) వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను 2021 జులైలో లాంచ్ చేసింది. ఒక సంవత్సరం తర్వాత కంపెనీ తన మొదటి స్మార్ట్‌ఫోన్ ఫోన్(1)ని 2022 ప్రారంభంలో జులైలో అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ దాని ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్లు, పోటీ ధరలతో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో సెకండ్ జనరేషన్ నథింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారికి నథింగ్ కంపెనీ సీఈవో కార్ల్ పీ ఒక బ్యాడ్ న్యూస్ అందించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ 13తో ‘సంథింగ్ గ్రేట్’
ట్విటర్లో నథింగ్ కంపెనీ సీఈవో కార్ల్ పీ ఓక పోస్ట్ చేశారు. నథింగ్ ఫోన్(2) త్వరలో లాంచ్ అయ్యే అవకాశం లేదని చెప్పారు. కంపెనీ సంవత్సరానికి డజను డివైజ్‌లను లాంచ్ చేయాలనే ప్లాన్‌లో లేదని స్పష్టం చేశారు. బదులుగా నథింగ్ ఫోన్ (1)పై ప్రధాన దృష్టి ఉందని, ఆండ్రాయిడ్ 13తో సంథింగ్ గ్రేట్ వినియోగదారులకు అందించే ప్రయత్నాల్లో ఉన్నామని కార్ల్ పీ చెప్పారు.
నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్లు
నథింగ్ ఫోన్ (1) ఈ సంవత్సరం జులైలో లాంచ్ అయింది. స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్ రూ.32,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. 8GB RAM + 128GB స్టోరేజ్‌ను అందిస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4,500mAh బ్యాటరీతో వస్తుంది. హ్యాండ్సెట్ వినూత్నమైన గ్లిఫ్ ఇంటర్ఫేస్తో వస్తుంది. ఇది ఇన్కమింగ్ కాల్లు, యాప్ అలర్ట్‌లు, ఛార్జింగ్ స్టేటస్, ఇతర సమాచారం గురించి వెనుకవైపు ప్రత్యేక లైట్ ప్యాటర్న్స్ ద్వారా వినియోగదారులను అలర్ట్ చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 18 గంటల సమయం ఉపయోగించవచ్చని, రెండు రోజులు స్టాండ్బైలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది, కేవలం 30 నిమిషాల ఛార్జ్‌లో 0 నుంచి 50% పవర్ వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలియజేసింది.
కార్ల్ పీ ఐఫోన్ 14 అభిమాని
ఇటీవల నథింగ్ సీఈఓ కార్ల్ పీని తాజా యాపిల్ ఐఫోన్ 14 ప్రోని సమీక్షించమని అడిగారు. ఈ డివైజ్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఐఫోన్ 14 ప్రో మార్కెట్లో 'ఉత్తమ హై ఎండ్ స్మార్ట్ఫోన్లలో ఒకటి' అని అన్నారు. ఈ యాపిల్ ప్రొడక్ట్‌కు అభిమానినని కూడా అంగీకరించారు. ఫోన్ కెమెరాను నథింగ్ ఫోన్ (1)లో ఉన్న కెమెరాతో పోల్చి చూస్తే, ఐఫోన్ 14 ప్రో అత్యుత్తమ కెమెరాలలో ఒకటిగా ఉందని తెలిపారు. అయితే నథింగ్ ఫోన్ (1) కూడా దాని ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nothing, Nothing mobile