Home /News /technology /

NOTHING BRAND ANNOUNCES LAUNCH OF SMARTPHONE WHENEVER THE COMPANY FIRST PHONE WAS LAUNCHED GH VB

Nothing Phone 1: స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన నథింగ్ బ్రాండ్.. లాంచ్ అయ్యేది ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఏడాది సమ్మర్‌లో నథింగ్ బ్రాండ్ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు నథింగ్ కంపెనీ హెడ్ కార్ల్ పీ (Carl Pei) తాజాగా ప్రకటించారు. బుధవారం జరిగిన నథింగ్ ఈవెంట్‌లో భాగంగా ఆయన కంపెనీ ఫస్ట్ ఫోన్ అయిన నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) అనౌన్స్ చేశారు.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌లో యాపిల్ (Apple) బ్రాండ్ ఫోన్లను మించిన ఫోన్స్ లేవని చెప్పవచ్చు. అయితే ఇలాంటి టాప్ ఫోన్లకు బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫోన్స్ తీసుకొచ్చేందుకు లండన్ టెక్ కంపెనీ నథింగ్ (Nothing) ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సమ్మర్‌లో నథింగ్ బ్రాండ్ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు నథింగ్ కంపెనీ హెడ్ కార్ల్ పీ (Carl Pei) తాజాగా ప్రకటించారు. బుధవారం జరిగిన నథింగ్ ఈవెంట్‌లో భాగంగా ఆయన కంపెనీ ఫస్ట్ ఫోన్ అయిన నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) అనౌన్స్ చేశారు. నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్ ను అధికారికంగా ప్రకటించడంతో పాటు మరిన్ని వివరాలను కార్ల్ పీ రివీల్ చేశారు. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేసే నథింగ్ ఫోన్... కొత్త నథింగ్ ఓఎస్ (Nothing OS) ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుందని కార్ల్ పీ పేర్కొన్నారు. అయితే నథింగ్ మొబైల్లో క్వాల్‌కామ్‌ లో ఏ హార్డ్‌వేర్ మోడల్ ను యూజ్ చేశారనేది తెలియాల్సి ఉంది.

"నథింగ్స్ ప్రొడక్ట్ ఎకోసిస్టమ్ ఓపెన్, డిఫరెంట్‌గా ఉంటుంది" అని లాంచ్ ఈవెంట్‌లో కార్ల్ పీ చెప్పుకొచ్చాడు. బోరింగ్ గా మారిన స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో నథింగ్ ఫోన్ తో ఫ్రెష్ నెస్ తీసుకొస్తామని ఆయన అన్నారు. బ్రిటిష్ కాలమానం ప్రకారం వేసవిలో రిలీజ్ చేస్తామని కార్ల్ పీ ప్రకటించారు. దీనర్థం ఫోన్ జులై లేదా ఆగస్టు నెలలో లాంచ్ అవ్వచ్చు. గ్లోబల్ గా లాంచ్ అయిన టైమ్‌లోనే నథింగ్ ఫోన్ 1 ఇండియాలో కూడా లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Money Scheme: ఈ స్కీమ్‌లో చేరడానికి మార్చి 31 చివరి తేదీ

స్టాక్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లోని బెస్ట్ ఫీచర్లను నథింగ్ ఓఎస్ యూజ్ చేయనుంది. ఈ సాఫ్ట్‌వేర్ చాలా ఫాస్ట్ & స్మూత్ గా పని చేస్తుంది. నథింగ్ ఫోన్ (1) మూడు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను, నాలుగు సంవత్సరాల పాటు ప్రైవసీ అప్‌డేట్‌లను పొందుతుంది. డయలర్, వాయిస్ రికార్డర్ యాప్‌ల ఫొటోలు ప్రదర్శిస్తూ నథింగ్ ఫోన్ ఐకానిక్ డిజైన్ గురించి కూడా కార్ల్ మాట్లాడాడు. రికార్డర్ యాప్ సౌండ్‌ని ఎలా క్యాప్చర్ చేస్తుందో డెమో కూడా చూపించాడు. వచ్చే నెల అంటే ఏప్రిల్ నుంచి సెలెక్టెడ్ స్మార్ట్‌ఫోన్‌లకు నథింగ్ ఓఎస్ లాంచర్ అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఓఎస్ లో హెవీ సిస్టమ్ యాప్స్, బ్లోట్ వేర్ ఉండదు. నథింగ్ మొబైల్ ఫోన్ లో శాంసంగ్, సోనీ కాంపోనెంట్స్ వాడే అవకాశం ఉంది.

అనౌన్స్ ఈవెంట్ లో మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ గురించి హింట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటి ప్రకారం, నథింగ్ ఫోన్ (1) బ్యాక్ సైడ్ నోటిఫికేషన్ లైట్స్ తో ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే కొన్ని కీ కాంపోనెంట్స్ కనపడేలా ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ డిజైన్ ఇవ్వచ్చు. ఇందులో డైనమిక్ ర్యామ్ క్యాచింగ్ వాడటం వల్ల యాప్స్ ఫుల్ ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి. మరి ఈ స్మార్ట్ ఫోన్ యాపిల్ ఐఫోన్లకు గట్టి పోటీ ఇస్తున్న లేదా అనేది మరి కొద్ది నెలల్లో తెలియనుంది.
Published by:Veera Babu
First published:

Tags: Nothing, Smart phone, Technolgy

తదుపరి వార్తలు