హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nothing Lite Phone: నథింగ్ నుంచి లైట్ వెర్షన్ ఫోన్.. ఫీచర్స్, బ్యాటరీ, స్పెసిఫికేషన్స్, ధర..

Nothing Lite Phone: నథింగ్ నుంచి లైట్ వెర్షన్ ఫోన్.. ఫీచర్స్, బ్యాటరీ, స్పెసిఫికేషన్స్, ధర..

Nothing Phone 1: 
(image: Nothing)

Nothing Phone 1: (image: Nothing)

నథింగ్ కంపెనీ నుంచి వచ్చే నెక్స్ట్ ఫోన్ లైట్ వెర్షన్‌గా లాంచ్ కావచ్చు. ఇందులో నథింగ్ ఫోన్ 1లో లాగా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ (Glyph interface) ఉండకపోవచ్చని లేటెస్ట్ టెక్ రిపోర్ట్ పేర్కొంది.

కార్ల్ పీ (Carl Pei) కంపెనీ నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ (1) గత నెలలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కంపెనీ మరొక సరికొత్త మొబైల్ తీసుకువచ్చే పనిలో పడింది. ఒక లేటెస్ట్ రిపోర్టు ప్రకారం, కంపెనీ నుంచి వచ్చే నెక్స్ట్ ఫోన్ లైట్ వెర్షన్‌గా లాంచ్ కావచ్చు. ఇందులో నథింగ్ ఫోన్ 1లో లాగా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ (Glyph interface) ఉండకపోవచ్చని లేటెస్ట్ టెక్ రిపోర్ట్ పేర్కొంది. నథింగ్ ఫోన్‌ 1లో ఛార్జింగ్ ఇండికేషన్, ప్రోగ్రెస్ బార్ చూపించే ఫోన్ ఇంటర్‌ఫేస్‌ ఉంటుంది. ఇందులో అందించిన గ్లిఫ్ లైట్లు ఒక సర్కిల్, ఒక స్ట్రిప్‌లాగా వెనుక భాగంలో కనిపిస్తాయి. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు.. సర్కిల్ వెలుగుతుంది. ఫోన్‌లో ఛార్జ్ ఎంత ఎక్కిందో చూపడానికి దాని పైన ఉన్న స్ట్రిప్ ప్రోగ్రెస్ బార్‌గా రెట్టింపు అవుతుంటుంది. అయితే కంపెనీ నుంచి వచ్చే నెక్స్ట్ ఫోన్‌ లైట్ వెర్షన్‌ (Lite Version)లో ఇలాంటి గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌, లైట్స్ ఏమీ ఉండవని తెలుస్తోంది.

ఈ కొత్త ఫోన్ ఫోన్ (1) మోడల్‌కు పాకెట్ ఫ్రెండ్లీ వెర్షన్‌గా రావచ్చని టెక్ రిపోర్ట్స్ ప్రకారం స్పష్టమవుతోంది. ఈ ఫోన్‌లో LED Glyph ఇంటర్‌ఫేస్ తొలగించడంతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి కొన్ని ఫీచర్‌లను కంపెనీ తీసివేయవచ్చని రిపోర్టర్ పేర్కొంది. అంటే ప్లేన్ గ్లాస్ డిజైన్‌తో నథింగ్ ఫోన్ లైట్ రిలీజ్ అవ్వచ్చు.

ఈ లైట్ వెర్షన్‌లో ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా సెన్సార్లు మాత్రం ఫోన్ (1)లో లాగానే ఉండొచ్చని రిపోర్ట్ అభిప్రాయపడింది. వైర్‌లెస్ ఛార్జింగ్‌ను భర్తీ చేయడానికి బాక్స్‌లో ఒక ఛార్జర్‌ను ఆఫర్ చేయవచ్చు. ఈ ఛార్జర్ 42W ఛార్జర్ అని రిపోర్ట్ పేర్కొంది. ఈ ఫోన్ 5,000 mAh భారీ బ్యాటరీతో లాంచ్ కావచ్చని సమాచారం. అంటే నథింగ్ ఫోన్ 1 కంటే 500mAh ఎక్కువ కెపాసిటీతో లైట్ వెర్షన్ వస్తుందని చెప్పవచ్చు.

Noise Buds Prima 2: నాయిస్ కంపెనీ నుంచి కొత్త ఇయర్ బడ్స్ లాంచ్.. ధర కేవలం రూ.1299.. ఫీచర్లు ఇవే..



ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌ల గురించి ఇప్పటివరకైతే ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. లైట్ వెర్షన్ 6GB/128 GB వేరియంట్‌ దాదాపు రూ.24,999 ధరతో మార్కెట్ లోకి రిలీజ్ అవ్వచ్చని నివేదిక ప్రకారం తెలుస్తోంది. బడ్జెట్ తక్కువ ఉన్నవారు, అలానే ఎల్ఈడీ ఇండికేషన్స్ వద్దనుకునే వారికి ఈ లైట్ ఫోన్ ఉత్తమంగా నిలబడవచ్చు. ప్రస్తుతం, నథింగ్ ఫోన్ (1) రూ.32,999 స్టార్టింగ్ ప్రైస్‌తో దొరుకుతోంది. అంటే దీని కంటే దాదాపు పదివేల రూపాయలు తక్కువ ధరతో కంపెనీ లైట్ ఫోన్ తీసుకొచ్చి మరింత మంది వినియోగదారులకు చేరువ కావాలని చూస్తోంది. నథింగ్ ఫోన్ (1) మాదిరిగానే, లైట్ వెర్షన్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ OSతో పని చేస్తుందని టాక్. ఇందులో IP53 స్ప్లాష్ రెసిస్టెన్స్‌ను కూడా అందించినట్లు సమాచారం.

Xiaomi Mijia Glasses: ఇదో ‘జేమ్స్‌బాండ్‘ గ్లాసెస్.. వావ్ ఎన్ని ఫీచర్లో.. ధర ఏంతంటే..



నథింగ్ ఫోన్ (1) మోడల్‌కు చౌకైన వేరియంట్ ఫోన్‌ను తీసుకొస్తే కంపెనీకి కస్టమర్లను ఎక్కువగా పెంచుకోవడం సాధ్యమవుతుంది. ఈ కంపెనీ ఫోన్‌లో గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌యే చాలా ప్రత్యేకమైనది అలాంటి దాన్ని తీసేస్తే మరి కస్టమర్లు లైట్ వచ్చి అనుకుంటారా లేదా అనేది కూడా తెలియాలి. ఈ ఇంటర్‌ఫేస్‌ను అడ్జస్ట్, ఇంప్రూవ్ చేయడానికి కంపెనీ ఇప్పటికే రెండు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ తీసుకొచ్చింది.

First published:

Tags: Nothing, Nothing mobile

ఉత్తమ కథలు