Home /News /technology /

NOT JUST TWITTER INSTAGRAM SUFFERS OUTAGE AS THOUSANDS AFFECTED UMG GH

Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. కొన్ని రోజులు అలా తప్పదంట..!

ఇన్‌స్టాగ్రామ్

ఇన్‌స్టాగ్రామ్

ప్రముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇన్‌స్టా యాప్ ప్రపంచ వ్యాప్తంగా ఓపెన్ కాకపోవడంతో యూజర్లు పోస్టులు అప్డేట్ చేయలేకపోయారు. స్టోరీస్ చూసేందుకు కూడా వీలు కాలేదు.

ప్రముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇన్‌స్టా యాప్ ప్రపంచ వ్యాప్తంగా ఓపెన్ కాకపోవడంతో యూజర్లు పోస్టులు అప్డేట్ చేయలేకపోయారు. స్టోరీస్ చూసేందుకు కూడా వీలు కాలేదు. ఈ సమస్య ఇండియాలో ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఒంటి గంట సమయంలో తలెత్తింది. అయితే అంతకు ముందే ట్విట్టర్ సేవల్లో అంతరాయం కలిగింది. దీనిపై కూడా కంపెనీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇన్‌స్టా యూజర్లు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల్లో తమ సమస్యలను తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ కావడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ యూజర్ల సమస్యలను ఇలా తెలిపింది. 61 శాతం యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ ఓపెన్ కాలేదని.. మరో 26 శాతం మంది యూజర్లకు లాగిన్‌ సమయంలో సమస్యలు తలెత్తాయని పేర్కొంది. వీరిలో 13శాతం మందికి సర్వర్ కనెక్షన్‌ సమస్యలు ఉత్పన్నమైనట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. ఈటీ (ET) ప్రకారం.. అమెరికాలో నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో దాదాపు 24,000 మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు యాప్ ఓపెన్ కాక సమస్యలు ఎదుర్కొన్నట్లు డౌన్‌‌డిటెక్టర్ తెలిపింది. ఇక భారతదేశంలో శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు సదరు వెబ్‌సైట్ పేర్కొంది. అయితే ఈ అంతరాయానికి సంబంధించి ‘మెటా’ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి: ట్విట్టర్ సీఈఓకు ఎలాన్ మస్క్ వార్నింగ్.. ఇద్దరి మధ్య మెసెజ్‌ వార్.. అసలేం జరిగిందంటే..?


ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయానికి సంబంధించి ‘మెటా’ ప్రతినిధి స్పందించినట్లు ప్రముఖ న్యూస్ సంస్థ రాయిటర్స్ తెలిపింది. ‘‘కొంతమంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నారని మా దృష్టికి వచ్చింది. సేవలను అంతరాయం లేకుండా సాధారణ స్థితికి తీసుకురావడానికి మేం కృషి చేస్తున్నాం. అసౌకర్యానికి గురైన యూజర్లను క్షమాపణలు కోరుతున్నాం’’. అని మెటా ప్రతినిధిని వ్యాఖ్యానించినట్లు రాయిటర్స్ పేర్కొంది.

అంతకు ముందురోజు గురువారం, ట్విట్టర్ సేవల్లో దాదాపు మూడు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈటీ ప్రకారం ఉదయం 8:15 గంటల సమయంలో ఈ సమస్య గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో దాదాపు 50,000 మంది యూజర్లు ప్రభావితమయ్యారని డౌన్‌‌డిటెక్టర్ వెబ్‌సైట్ వెల్లడించింది. అయితే కొన్ని గంటల తర్వాత ట్విట్టర్ తన సేవలను పునరుద్ధరించింది. ఈ సమస్యపై ఓ ట్వీట్ చేసింది.‘‘ఇంటర్నల్ సిస్టమ్స్‌లో సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యూజర్లపై ఈ ప్రభావం పడింది. మేం సాంకేతికంగా మరింత మెరుగవ్వాల్సి ఉంది. యూజర్ల అంచనాలకు తగ్గట్టుగా ట్విట్టర్ రన్ అవుతుంది.’’ అని సదరు సోషల్ మీడియా సంస్థ ఓ ట్వీట్ చేసింది.



కాగా, గతేడాది చివర్లో ‘మెటా’ సేవలు దాదాపు ఆరు గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్‌లకు సంబంధించిన బిలియన్ల కొద్దీ యూజర్లకు వాటి సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.
Published by:Mahesh
First published:

Tags: Instagram, Social Media, Technical, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు