Worst Passwords: మీ పాస్ వర్డ్ ఇదేనా? అయితే మీకు ముప్పు తప్పదు.. వెంటనే మార్చుకోండి

అనేక మంది చాలా సింపుల్ పాస్ వర్డ్ ను పెట్టుకుంటూ ఉంటారు. నంబర్లను వరుసగా 123456789 అని పాస్ వర్డ్ పెట్టుకునే వారు కూడా ఈ మధ్య బాగా పెరిగిపోయారు. దీంతో అత్యంత తెలివైన, కాచుకుని కూర్చునే హ్యాకర్లు ఇలాంటి పాస్ వర్డ్ లను సింపుల్ గా బ్రేక్ చేసి చేయాల్సిన నష్టం చేస్తున్నారు.

news18-telugu
Updated: November 21, 2020, 4:18 PM IST
Worst Passwords: మీ పాస్ వర్డ్ ఇదేనా? అయితే మీకు ముప్పు తప్పదు.. వెంటనే మార్చుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రస్తుతం సోషల్ మీడియా వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతీ ఒక్కరికీ మూడు, నాలుగు సోషల్ మీడియా సైట్లలో ఖాతాలు ఉంటున్నాయి. దీంతో పాటు మెయిల్, ఆన్లైన్ షాపింగ్ ఖాతాలు, ఆన్లైన్ బ్యాంకు అకౌంట్లు, ఫోన్ స్క్రీన్ లాక్ లు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటి పాస్ వర్డ్ లను గుర్తుంచుకోవడం నేడు అనేక మందికి పెద్ద సవాల్ గా మారింది. అనేక సార్లు ఒక ఖాతా పాస్ వర్డ్ మరో దానికి ఎంటర్ చేసి మిస్టేక్ చేస్తాము. ఎంత తల బద్ధలు కొట్టుకున్నా పాస్ వర్డ్ గుర్తుకు రాక రీ సెట్ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. బ్యాంకు ఖాతా పాస్ వర్డ్ మర్చిపోయి అకౌంట్ లాక్ అయిన ఘటనలు కూడా అనేక మందికి చోటు చేసుకునే ఉంటూనే ఉంటాయి. ఈ పరిణామాలతో విసుగు చెందిన అనేక మంది చాలా సింపుల్ పాస్ వర్డ్ ను పెట్టుకుంటూ ఉంటారు. నంబర్లను వరుసగా 123456789 అని పాస్ వర్డ్ పెట్టుకునే వారు కూడా ఈ మధ్య బాగా పెరిగిపోయారు.

దీంతో అత్యంత తెలివైన, కాచుకుని కూర్చునే హ్యాకర్లు ఇలాంటి పాస్ వర్డ్ లను సింపుల్ గా బ్రేక్ చేసి చేయాల్సిన నష్టం చేస్తున్నారు. నార్డ్ పాస్ సంస్థ 2020కి గాను అత్యంత చెత్త పాస్ వర్డ్ ల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో 123456 మొదటి స్థానంలో ఉంది. ఈ సంవత్సరం 2,543,285 మంది ఈ అంకెను తమ వివిధ ఖాతాలకు పాస్ వర్డ్ గా వాడుతున్నారని తెలిపింది. ఆ సంస్థ కొన్నేళ్లుగా విడుదల చేస్తున్న అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో ఈ సంఖ్యే మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ సంవత్సరం ఈ చెత్త పాస్ వర్డ్ ల జాబితాలో పిక్చర్‌1, సెన్హా (పోర్చుగీసులో పాస్‌వర్డ్‌) ఈ రెండు కొత్త పదాలు చేరినట్లు సంస్థ తెలిపింది.

అత్యంత చెత్త పాస్ వర్డ్ లు ఇవే..
నార్డ్ పాస్ వెల్లడించిన వివరాల ప్రకారం 2020 సంత్సరంలో అత్యధిక మంది ఉపయోగిస్తున్న చెత్త పాస్ వర్డులు ఇవే ‘‘123456, 123456789, picture1, password, 12345678, 111111, 123123, 12345, 1234567890, senha, 1234567, qwerty, abc123, Million2, 000000, 1234, iloveyou, aaron431, password1, and qqww1122’’. ఈ  సింపుల్ పాస్ వర్డ్ ఉన్న ఖాతాలను సెకండ్ల వ్యవధిలోనే హ్యాకర్లు ఓపెన్ చేస్తున్నారని సంస్థ తెలిపింది.

ఈ జాగ్రత్తలు పాటించాలి..
ఒక వేళ మీరు ఉపయోగించే పాస్ వర్డ్ కూడా ఈ జాబితాలో ఉంటే వెంటనే మార్చుకోవడం మంచిది. లేక పోతే మీ ఖాతా వివరాలు హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా కఠినమైన పాస్ వర్డ్ లను ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు. పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, పెళ్లి తేదీ, పేరు వంటి వ్యక్తిగత వివరాలతో కూడిన పాస్ వర్డ్ లను ఉపయోగించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి సింపుల్ పాస్ వర్డ్ ల ద్వారా మన వివరాలు త్వరగా హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Published by: Nikhil Kumar S
First published: November 21, 2020, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading