హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Weak Password: ఇండియాలో టాప్ 20 వీక్ పాస్‌వర్డ్స్ ఇవే... మీరు వెంటనే మార్చేయండి

Weak Password: ఇండియాలో టాప్ 20 వీక్ పాస్‌వర్డ్స్ ఇవే... మీరు వెంటనే మార్చేయండి

Weak Password: ఇండియాలో టాప్ 20 వీక్ పాస్‌వర్డ్స్ ఇవే... మీరు వెంటనే మార్చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

Weak Password: ఇండియాలో టాప్ 20 వీక్ పాస్‌వర్డ్స్ ఇవే... మీరు వెంటనే మార్చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Weak Password | సులువుగా గుర్తుపెట్టుకోవాలని సింపుల్‌గా ఉండే పాస్‌వర్డ్‌ని ఆన్‌లైన్ అకౌంట్లకు సెట్ చేస్తుంటారు. ఇండియాలో సాధారణంగా ఉపయోగిస్తున్న టాప్ 200 పాస్‌వర్డ్స్ జాబితా రిలీజ్ చేసింది నార్డ్ సెక్యూరిటీ.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఆన్‌లైన్ అకౌంట్స్ ఉన్నవారందరికీ పాస్‌వర్డ్స్ సెట్ చేసుకోవడం పెద్ద సవాల్‌గా ఉంటుంది. గుర్తుపెట్టుకునేలా పాస్‌వర్డ్ సెట్ చేయాలనుకొని చిక్కుల్లో పడుతుంటారు. వీక్ పాస్‌వర్డ్స్ (Weak Passwords) పెట్టి హ్యాకర్ల చేతుల్లో టార్గెట్ అవుతుంటారు. ప్రపంచంలో ఏఏ దేశాల్లో ఎలాంటి వీక్ పాస్‌వర్డ్స్ ఉపయోగిస్తున్నారనేదానిపై నార్డ్ సెక్యూరిటీ సంస్థ ప్రతీ ఏటా అధ్యయనం జరుపుతుంది. 2022 కి సంబంధించిన రిపోర్ట్‌ను విడుదల చేసింది. 2022 లో సాధారణంగా ఉపయోగించిన పాస్‌వర్డ్స్ జాబితాను విడుదల చేసింది. సొంత పాస్‌వర్డ్ మేనేజర్ అయిన నార్డ్‌పాస్ నివేదిక ప్రకారం ఈ జాబితాను రిలీజ్ చేసింది నార్డ్ సెక్యూరిటీ.

మరి ఈ జాబితాలో ఇండియాలో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న పాస్‌వర్డ్ ఏదో తెలుసా? "password". అవును password అనే ఇంగ్లీష్ పదాన్నే తమ అకౌంట్లకు పాస్‌వర్డ్‌గా ఉపయోగించారు యూజర్లు. password అనే పదాన్ని 3.4 మిలియన్ సార్లు అంటే 34 లక్షల సార్లు పాస్‌వర్డ్‌గా ఉపయోగించినట్టు తేలింది. ఆ తర్వాతి స్థానంలో "123456" ఉండగా మూడో స్థానంలో "12345678" ఉంది. ఇలా సుమారు 200 వీక్ పాస్‌వర్డ్స్ ఉన్న అకౌంట్స్‌ని హ్యాక్ చేయడానికి హ్యాకర్లకు ఒక సెకండ్ కన్నా తక్కువ టైమ్ పడుతుందని నార్డ్ సెక్యూరిటీ వెల్లడించింది. మరి నార్డ్ పాస్ గుర్తించిన టాప్-20 వీక్ పాస్‌వర్డ్స్ ఏవో తెలుసుకోండి.

5G Phones: తక్కువ ధరలో మంచి ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్స్... రూ.20వేల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

టాప్-20 వీక్ పాస్‌వర్డ్స్ ఇవే...

1. password

2. 123456

3. 12345678

4. bigbasket

5. 123456789

6. pass@123

7. 1234567890

8. anmol123

9. abcd1234

10. googledummy

11. Indya123

12. qwerty123

13. sahilji1

14. 987654321

15. kapil*12345

16. 123456789a

17. p@ssw0rd

18. India@123

19. india123

20. 12345

ఇవే కాదు... ఇలా ఇండియాలో ఎక్కువగా ఉపయోగిస్తున్న 200 పాస్‌వర్డ్స్ జాబితాను నార్డ్ సెక్యూరిటీ రిలీజ్ చేసింది. అందులో shopping, qwerty, omsairam, sachin@1234, 123, priyanka, iloveyou, saibaba, computer లాంటి కామన్ పాస్‌వర్డ్స్ ఉన్నాయి. ఇలాంటి కామన్ పాస్‌వర్డ్స్‌ని అకౌంట్స్‌కి పెట్టుకుంటే హ్యాకర్లు చాలా సింపుల్‌గా హ్యాక్ చేస్తారు. అందుకే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.

Redmi 10 Power: రూ.12,000 లోపే 8GB+128GB స్మార్ట్‌ఫోన్ కొనేయండి... అదిరిపోయే ఆఫర్

స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి?

పాస్‌వర్డ్ ఎప్పుడూ ఎక్కువ క్యారెక్టర్స్‌తో ఉండాలి. పాస్‌వర్డ్‌లో కనీసం 12 క్యారెక్టర్లు ఉండాలి. అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్స్, నెంబర్లు, సింబల్స్ కలిపి పాస్‌వర్డ్ సెట్ చేయాలి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేయడానికి పాస్‌వర్డ్ జనరేటర్ ఉపయోగించవచ్చు. ఒకే పాస్‌వర్డ్‌ని వేర్వేరు అకౌంట్లకు ఉపయోగించకూడదు. అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌ ఉంటే హ్యాకర్ల పని చాలా ఈజీ అవుతుంది. మీ అకౌంట్స్‌లో ఒకటి హ్యాక్ అయితే మిగతా అకౌంట్స్ రిస్కులో పడ్డట్టే. అందుకే ప్రతీ అకౌంట్‌కు కొత్త పాస్‌వర్డ్ ఉండాలి.

ఒకే పాస్‌వర్డ్‌ని ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు. నిత్యం పాస్‌వర్డ్స్ మారుస్తూ ఉండాలి. మీ అకౌంట్స్ అన్నింటినీ అప్పుడప్పుడూ రివ్యూ చేస్తూ పాస్‌వర్డ్ మార్చాలి. వీక్ పాస్‌వర్డ్స్ ఉంటే మార్చేసి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.

First published:

Tags: CYBER CRIME, Cyber security, Hackers, Hacking, Password

ఉత్తమ కథలు