స్మార్ట్‌ఫోన్ అతిగా వాడితే నోమోఫోబియా వస్తుంది జాగ్రత్త...

గుండె వేగంగా కొట్టుకోవడానికి, ఆందోళన పెరగడానికి, బీపీ ఎక్కువవడానికి, పిచ్చిపిచ్చి భావనలకు ఈ నోమోఫోబియానే కారణమవుతుంది. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉన్నా... దాని వల్లే కలిగే నష్టాలు కూడా ఎక్కువే. దానికి ఉదాహరణే నోమోఫోబియా.

Santhosh Kumar S | news18-telugu
Updated: January 18, 2019, 7:43 PM IST
స్మార్ట్‌ఫోన్ అతిగా వాడితే నోమోఫోబియా వస్తుంది జాగ్రత్త...
మీకూ నోమోఫోబియా ఉందా? ఫోన్ అతిగా వాడితే అంతేనా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నోమోఫోబియా... గత రెండు రోజులుగా దీని గురించే చర్చ. కారణం... 'నోమోఫోబియా' పదాన్ని పీపుల్స్ వార్డ్ ఆఫ్ 2018గా ప్రకటించింది కేంబ్రిడ్జి డిక్షనరీ. 'జెండర్ గ్యాప్', 'ఎకోసైడ్' లాంటి పదాలతో పోటీ పడీ మరీ నోమోఫోబియా మొదటి స్థానంలో నిలిచింది. ఎక్కువ ఓట్లు 'నోమోఫోబియా' పదానికే రావడంతో అది ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. దీంతో 'నోమోఫోబియా' ఏంటీ..? దానికి ఎందుకంత గుర్తింపు? అన్న చర్చ మొదలైంది.

నోమోఫోబియా అంటే..?

'నో మోబైల్ ఫోన్ ఫోబియా'కు సంక్షిప్త నామమే నోమోఫోబియా. అయ్యో స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఎట్లా? ఫోన్ వాడలేని పరిస్థితి వస్తే ఎలా? అన్న భయమే నోమోఫోబియా. వినడానికి ఏముంది ఇందులో అంత అనుకుంటారు కానీ... ఒక్కసారి నిజంగా స్మార్ట్‌ఫోన్ ఓరోజు వదిలేసి చూడండి. ఓ రోజు కాదు... ఓ పూట స్మార్ట్‌ఫోన్ పక్కన పెట్టి గడపండి. మీకు నోమోఫోబియా ఉందో లేదో తెలిసిపోతుంది. మీరు కూడా ఇలాగే... అయ్యో ఫోన్ లేదే అని పదేపదే అనుకున్నారంటే... మీకూ నోమోఫోబియా ఉన్నట్టే.

మీకూ నోమోఫోబియా ఉందా? ఫోన్ అతిగా వాడితే అంతేనా?, 'Nomophobia' Declared People's Word of 2018 by Cambridge Dictionary, What is 'Nomophobia'? How to deal?

నోమోఫోబియా లక్షణాలు
స్మార్ట్‌ఫోన్ వాడేవారిలో 50% మందికి పైగా నోమోఫోబియా ఉందని అంచనా. అంటే... స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతీ ఇద్దరిలో ఒకరికి ఈ మాయరోగం ఉందన్నమాట. అయ్యో... ఆ లిస్ట్‌లో నేనూ ఉన్నానా అని మీరు కంగారుపడకండి. నోమోఫోబియాకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మీకూ ఉన్నాయంటే మీరూ నోమోఫోబియా బారిన పడ్డట్టే. ఆ లక్షణాలు ఇవే...

మీ ఫోన్ స్విచ్ఛాఫ్ కాగానే కంగారుపడుతున్నారా?బ్యాటరీ 10% లోపు ఉన్నప్పుడు ఆందోళనగా ఉందా?
మీ ఫోన్‌లో నెట్‌వర్క్ సరిగ్గా లేక ఫోన్ ఆపరేట్ చేయలేకపోతే చికాకుగా అనిపిస్తుందా?
సడెన్‌గా మొబైల్ డేటా, వైఫై ఆగిపోతే ఏదో కోల్పోయినట్టు భావిస్తున్నారా?
ఐదు నిమిషాలకోసారి వాట్సప్‌ ఓపెన్ చేసి ఏవైనా మెసేజ్‌లు వచ్చాయేమోనని చూస్తున్నారా?
ఫోన్ రింగ్ కాకపోయినా... రింగ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుందా?
జేబులోంచి మీ ఫోన్ పడిపోతుందని భయంగా ఉందా?
మీ ఫోన్ ఎవరైనా కొట్టేసినట్టు కలలు వస్తున్నాయా?
అసలు ఫోన్ సైలెంట్‌లో పెట్టాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారా?
ఫోన్ లేకుండా ఎక్కడికైనా వెళ్లాలంటేనే మీ వల్ల కావట్లేదా?
కనీసం ఓ గంటపాటు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా?

మీకూ నోమోఫోబియా ఉందా? ఫోన్ అతిగా వాడితే అంతేనా?, 'Nomophobia' Declared People's Word of 2018 by Cambridge Dictionary, What is 'Nomophobia'? How to deal?

వీటికి మీ సమాధానం అవును అయితే అవి నోమోఫోబియా లక్షణాలే. వీటితో వచ్చే నష్టం ఏముందిలే అనుకుంటే పొరపాటే. ఇవన్నీ గుండె వేగంగా కొట్టుకోవడానికి, ఆందోళన పెరగడానికి, బీపీ ఎక్కువవడానికి, పిచ్చిపిచ్చి భావనలకు ఈ నోమోఫోబియానే కారణమవుతుంది. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉన్నా... దాని వల్లే కలిగే నష్టాలు కూడా ఎక్కువే. దానికి ఉదాహరణే నోమోఫోబియా. స్మార్ట్‌ఫోన్ అతిగా ఉపయోగించడం, ప్రతీ దానికీ స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడటం, చివరకు అది వ్యసనంగా మారడం... నోమోఫోబియాకు దారితీస్తుంది.

నోమోఫోబియా నుంచి ఎలా బయటపడాలి?
నోమోఫోబియా నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం ఫోన్‌కు దూరంగా ఉండటమే. అలాగని ఫోన్‌ను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతీ దానికి స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడే అలవాటును తగ్గించుకోవాలి.  ఏ చిన్న డౌట్ వచ్చినా గూగుల్‌ ఓపెన్ చేస్తుంటారు. అలా కాకుండా కాస్త బుర్రకు పనిచెప్పాలి. ఏ పదానికైనా అర్థం కావాలంటే... గూగుల్ ట్రాన్స్‌లేటే అవసరం లేదు. ఇంట్లో ఉన్న డిక్షనరీని తెరవాలి. వీలైనంత వరకు స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడకుండా చూసుకోవాలి. ఫోన్ స్విచ్ఛాఫ్ అయినంత మాత్రానా ప్రపంచం ఏమీ మునిగిపోదు. అందుకే బ్యాటరీ అయిపోతే మీరు ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడుతూ మేము చాలా స్మార్ట్‌ అని అనుకుంటే పొరపాటే.

ఇవి కూడా చదవండి:

వాట్సప్‌లో వెంటనే మార్చాల్సిన సెట్టింగ్స్ ఇవే...

రియల్‌మీ యూ1 లుక్ ఎలా ఉందో చూశారా?

మీ డబ్బుతో డబ్బు సంపాదించే 5 మార్గాలు

ఎస్‌బీఐ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన 3 డెడ్‌లైన్స్ ఇవే...

యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?
Published by: Santhosh Kumar S
First published: January 18, 2019, 7:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading