Home /News /technology /

NOKIA XR20 RUGGED SMARTPHONE LAUNCHED WITH MILITARY GRADE DURABILITY KNOW SPECIFICATIONS AND FEATURES SS

Nokia XR20: నోకియా ఎక్స్ఆర్20 రిలీజ్... ఈ స్మార్ట్‌ఫోన్‌కు కేస్ అవసరం లేదు, కింద పడ్డా ఏమీ కాదు

Nokia XR20: నోకియా ఎక్స్ఆర్20 రిలీజ్... ఈ స్మార్ట్‌ఫోన్‌కు కేస్ అవసరం లేదు, కింద పడ్డా ఏమీ కాదు
(image: Nokia)

Nokia XR20: నోకియా ఎక్స్ఆర్20 రిలీజ్... ఈ స్మార్ట్‌ఫోన్‌కు కేస్ అవసరం లేదు, కింద పడ్డా ఏమీ కాదు (image: Nokia)

Nokia XR20 | కిందపడ్డా పగిలిపోని స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అలాంటి మొబైల్‌ను నోకియా రిలీజ్ చేసింది. నోకియా ఎక్స్ఆర్20 ప్రత్యేకతలు తెలుసుకోండి.

    నోకియా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రగ్డ్ మొబైల్‌ను రిలీజ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. మిలిటరీ గ్రేడ్ వాటర్ ప్రూఫ్ సామర్థ్యంతో నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రగ్డ్‌నెస్‌తో హెచ్ఎండీ నుంచి వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్ఆర్20. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే లైఫ్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ ఇది. వాటర్‌ప్రూఫ్, షాక్‌ప్రూఫ్ బాడీతో తయారైంది. ఈ స్మార్ట్‌ఫోన్ మరో ప్రత్యేకత ఏంటంటే నాలుగేళ్ల పాటు మంత్లీ సెక్యూరిటీ అప్‌డేట్స్, మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్స్ లభిస్తాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 11 వర్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14 అప్‌గ్రేడ్స్ లభిస్తాయి. 6 జీబీ + 128 జీబీ మెమొరీ వేరియంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. నోకియా ఎక్స్ఆర్20 ధర 550 డాలర్లు. అంటే రూ.40,900. ఆగస్ట్ 24న సేల్ మొదలవుతుంది.

    Samsung Galaxy A22 5G: సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ సేల్ ప్రారంభం... రూ.1,750 వరకు డిస్కౌంట్

    Samsung Galaxy M21 2021: సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త మోడల్ సేల్ మొదలైంది... ఆఫర్ వివరాలు ఇవే


    నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్డ్‌గా చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ సపోర్ట్ చేస్తుంది. నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 13 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరాలు ZEISS టెక్నాలజీతో పనిచేస్తాయి. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. స్టీరియో స్పీకర్లకు ఓజో ఆడియో సపోర్ట్ చేస్తుంది. నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్‌లో 4630ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 18వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్-సీ పోర్ట్ ఉంది. ఈ ఫోన్ బరువు 248గ్రాములు. అల్‌ట్రా బ్లూ, గ్రానైట్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు.

    Poco F3 GT: కాసేపట్లో పోకో ఎఫ్3 జీటీ సేల్... డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలివే

    Redmi Note 10T 5G: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 10టీ 5జీ సేల్... రూ.1,750 వరకు డిస్కౌంట్

    నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్‌కు రగ్డ్‌ కేస్‌తో మిలిటరీ గ్రేడ్ మన్నిక ఉండటం విశేషం. 1.8 మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డా, నీటిలో మునిగినా, మట్టిలో పడిపోయినా ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఏమీ కాదు. వాటర్‌ప్రూఫింగ్ కోసం ఐపీ68 సర్టిఫికెట్ ఉంది. సాధారణంగా ఏ ఫోన్ కొన్నా వెంటనే ఓ కేస్ కొనడం అలవాటు. అసలు ఈ స్మార్ట్‌ఫోన్‌కు కేస్ అవసరం లేదు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఉన్న ఫోన్ స్క్రీన్ ప్రొటెక్షన్‌లో ఇదే డ్యూరబుల్ గ్లాస్. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే ఇండియాలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Nokia, Smartphone, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు