Home /News /technology /

Nokia X100: నోకియా నుంచి బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..

Nokia X100: నోకియా నుంచి బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

HMD గ్లోబల్ సంస్థ మొట్టమొదటి నోకియా X-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను అమెరికన్ యూజర్ల కోసం తయారు చేసింది. నోకియా ఎక్స్ 100 (Nokia X100) పేరుతో ఇది యూఎస్ మార్కెట్లోకి లాంచ్ అయింది.

గతంలో మొబైల్ ఫోన్ల తయారీతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన నోకియా(Nokia) నుంచి సరికొత్త బడ్జెట్ 5జీ ఫోన్(5G Smartphone) లాంచ్ అయింది. HMD గ్లోబల్ సంస్థ మొట్టమొదటి నోకియా X-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను అమెరికన్ యూజర్ల కోసం తయారు చేసింది. నోకియా ఎక్స్ 100 (Nokia X100) పేరుతో ఇది యూఎస్ మార్కెట్లోకి లాంచ్ అయింది. T-మొబైల్, మెట్రో నెట్‌వర్క్ క్యారియర్‌ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని హెచ్‌ఎండీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 5G చిప్‌సెట్ సాయంతో పనిచేస్తుంది. నోకియా ఎక్స్ 100.. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో లభిస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా దీంట్లో ఉంటుంది. దీని సాయంతో స్టోరేజ్‌ను 1TB వరకు పొడిగించుకోవచ్చు. ఈ బడ్జెట్ 5జీ ఫోన్‌లో నోకియా క్వాడ్ కెమెరా సెటప్‌ను అందించింది.

ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ స్నాపర్‌ని అందించింది. నోకియా X100 డివైజ్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ డివైజ్‌ను ఆండ్రాయిడ్ 12 తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఎప్పుడు పొందుతుందనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
Vivo: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఆకట్టుకునే ఫీచర్లు.. వివరాలివే..

నోకియా X100 డివైజ్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4,470mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి సంబంధించిన ఒరిజినల్ ఛార్జర్‌ను కూడా సంస్థ అందిస్తుంది. నోకియా X100 ధర 252 డాలర్లుగా (సుమారు రూ.18,700) ఉంది. ఇది అమెరికాలో నవంబర్ 19 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో దీని లాంచింగ్‌పై స్పష్టత లేదు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile App, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు