HOME »NEWS »TECHNOLOGY »nokia to launch new smartphone in this month in india know expected price and specifications ss

Nokia 3.4: నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ధర ఎంతంటే

Nokia 3.4: నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ధర ఎంతంటే
Nokia 3.4: నోకియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ధర ఎంతంటే

Nokia 3.4 | నోకియా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతోంది నోకియా. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఒకప్పుడు ఫీచర్ ఫోన్లలో నోకియాది తిరుగులేని ఆధిపత్యం. కానీ స్మార్ట్‌ఫోన్ల విషయంలో నోకియా బ్రాండ్ అంతగా పోటీపడలేకపోయింది. సాంసంగ్, షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీల దూకుడును నోకియా తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నోకియా కూడా పోటాపోటీగా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేస్తూ రేస్‌లో నిలుస్తోంది. ఇప్పటికీ నోకియాకు ఫ్యాన్స్ ఉన్నారు. నోకియా నుంచి మంచి స్మార్ట్‌ఫోన్ వస్తే కొనాలని ఎదురుచూస్తున్నారు. నోకియా ఇటీవల వరుసగా ఫోన్లను రిలీజ్ చేస్తోంది. త్వరలోనే ఇండియాలో నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది హెచ్ఎండీ గ్లోబల్. ఇప్పటికే ఈ ఫోన్ యూరప్ మార్కెట్‌లో రిలీజైంది. ఈ నెలలోనే నోకియా 3.4 ఇండియాకు రానుంది. ప్రీఆర్డర్స్ కూడా ఇదే నెలలో మొదలవుతాయి. ఇక ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో నోకియా 3.4 రిలీజ్ అయింది కాబట్టి స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసినవే. 6.39 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. నోకియా 3.4 ప్రారంభ ధర రూ.11,999 ఉండొచ్చని అంచనా.

    LPG Gas Cylinder: ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందండి ఇలా



    Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

    నోకియా 3.4 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.39 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 3జీబీ, 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460
    రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ (10వాట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: చార్‌కోల్, డస్క్, జార్డ్
    ధర: ప్రారంభ ధర రూ.11,999

    BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... రోజుకు రూపాయి మాత్రమే

    Oppo F17 Pro: న్యూ ఇయర్ ఆఫర్... ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్

    ఇక ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. ఇందులో మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. ఒకే వేరియంట్‌లో ఈ ఫోన్ రిలీజ్ అయింది. 3జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.రూ.11,499. రూ.1,100 డిస్కౌంట్ కూడా ప్రకటించింది నోకియా. అంటే రూ.10,399 ధరకే నోకియా 2.4 సొంతం చేసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:December 09, 2020, 13:06 IST

    टॉप स्टोरीज