ఇండియన్ మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతోంది నోకియా. గతంలోనే యూరప్ మార్కెట్లో నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. 2020 సెప్టెంబర్‌లో నోకియా 2.4 మోడల్‌తో పాటు నోకియా 3.4 మోడల్ రిలీజైంది. వీటిలో ఇప్పటికే నోకియా 2.4 ఇండియాలో రిలీజైంది. 3జీబీ వేరియంట్ ధర రూ.10,399. ఇక దీంతో పాటు రిలీజైన నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసేందుకు కసరత్తు చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్... త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అంతేకాదు... మొత్తం స్పెసిఫికేషన్స్‌ని కూడా ప్రకటించేసింది. నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్ కన్నా ధర కాస్త ఎక్కువగా ఉండొచ్చని అంచనా. నోకియా 3.4 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లో కేవలం గూగుల్‌కు సంబంధించిన యాప్స్ మాత్రమే ఉంటాయి. థర్ట్ పార్టీ యాప్స్, బ్లోట్‌వేర్ ఉండదు. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, సెక్యూరిటీ అఫ్డేట్స్ లభిస్తాయి.
నోకియా 3.4 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.39 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. 3జీబీ+32జీబీ, 3జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజింగ్, పోర్ట్రైట్ మోడ్, నైట్ మోడ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇక బ్యాటరీ 4,000ఎంఏహెచ్ మాత్రమే. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్‌ను చార్కోల్, డస్క్, జార్డ్ కలర్స్‌లో కొనొచ్చు.
నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రూ.12,000 లోపు ధరతో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ బడ్జెట్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన పోకో ఎం3, రియల్మీ నార్జో 20, రెడ్మీ 9 పవర్ లాంటి స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.