హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nokia Smartphones: నోకియా నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు... లాంఛింగ్ ఎప్పుడంటే

Nokia Smartphones: నోకియా నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు... లాంఛింగ్ ఎప్పుడంటే

Nokia Smartphones: నోకియా నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు... లాంఛింగ్ ఎప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Nokia Smartphones: నోకియా నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు... లాంఛింగ్ ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

Nokia Smartphones | నోకియా మరో 3 కొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ మోడల్స్ ఏవో, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

హెచ్ఎండి గ్లోబల్ సంస్థ ఈ ఏడాది చివరి నాటికి సరికొత్త నోకియా స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌కు పరిచయం చేయడానికి సిద్దమవుతోంది. ఈ ఏడాది నవంబర్‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉంది. నోకియా 9.3 ప్యూర్ వ్యూ, నోకియా 7.3 5 జి, నోకియా 6.3 పేర్లతో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లలో నోకియా 9.3 ప్యూర్‌వ్యూ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా నోకియా చెబుతోంది. హెచ్ఎండి గ్లోబల్ సంస్థ నవంబర్ నెలలో నిర్వహించనున్న నోకియా 9.3 ప్యూర్ వ్యూ లాంచ్ ఈవెంట్లోనే నోకియా 7.3 5జీని కూడా ఆవిష్కరిస్తుందని నోకియా పవర్ యూజర్ తెలిపారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ప్రస్తుతం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కంపెనీ లాంఛింగ్‌ను డిసెంబర్‌కు వాయిదా వేసే అవకాశం ఉంది.

Poco X3: ఈరోజే పోకో ఎక్స్3 ఫస్ట్ సేల్... డిస్కౌంట్‌తో కొనండి ఇలా

Samsung: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్

నోకియా అట్రాక్టివ్ ఫీచర్లతో నూతన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్లలో స్పెషిఫికేషన్స్ విషయానికొస్తే తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ అయిన నోకియా 9.3 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ ఓఎల్ఇడి డిస్ప్లే, 108 ఎంపి ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. కాగా, నోకియా 9.3 స్మార్ట్‌ఫోన్‌లో 64MP, 24MP, 20MP, 48MP సెన్సార్లతో సహా మల్టిపుల్ సెన్సార్లను అమర్చడానికి పరిశీలిస్తుంది. నోకియా 7.3 5జి స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 690 చిప్‌సెట్, 48 ఎంపి ప్రైమరీ సెన్సార్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉన్న 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 -అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానుంది. ఇక నోకియా 6.3 విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్డ్రాగన్ 670 లేదా 675 మొబైల్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ZEISS ఆప్టిక్స్‌తో క్వాడ్-కెమెరా సెటప్‌ను అందిస్తుందని భావిస్తున్నారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Android 10, Nokia, Smartphone

ఉత్తమ కథలు