Home /News /technology /

Nokia T20 Tablet: నోకియా టీ20 ట్యాబ్లెట్ లాంచ్.. 8,200 ఎంఏహెచ్​ అతిపెద్ద బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు

Nokia T20 Tablet: నోకియా టీ20 ట్యాబ్లెట్ లాంచ్.. 8,200 ఎంఏహెచ్​ అతిపెద్ద బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు

నోకియా టీ20 ట్యాబ్లెట్

నోకియా టీ20 ట్యాబ్లెట్

ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ నోకియాకు చెందిన HMD గ్లోబల్ తన మొట్టమొదటి ట్యాబ్లెట్​ను విడుదల చేసింది. నోకియా టి 20 (Nokia T20) టాబ్లెట్​ పేరుతో బుధవారం దీన్ని లాంచ్​ చేసింది. రూ. 20 వేల ధర రేంజ్​లో విడుదలైన ఈ ట్యాబ్లెట్​లో అద్భుతమైన ఫీచర్లను జోడించింది.

ఇంకా చదవండి ...
ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ నోకియాకు చెందిన HMD గ్లోబల్ తన మొట్టమొదటి ట్యాబ్లెట్​ను విడుదల చేసింది. నోకియా టి 20 (Nokia T20) టాబ్లెట్​ పేరుతో బుధవారం దీన్ని లాంచ్​ చేసింది. రూ. 20 వేల ధర రేంజ్​లో విడుదలైన ఈ ట్యాబ్లెట్​లో అద్భుతమైన ఫీచర్లను జోడించింది. ట్యాబ్‌​తో పాటు HMD గ్లోబల్ ఒక రగ్గుడ్​ కేస్​, రగ్గుడ్​ కేస్​ ప్లస్​ ఫ్లిప్​ కవర్​/ స్టాండ్​, నోకియా మైక్రో ఇయర్​బడ్స్​ ప్రో యాక్సెసరీస్​ను కూడా లాంచ్​ చేసింది. వీటన్నింటినీ నోకియా T20 ట్యాబ్లెట్ కోసమే ప్రత్యేకంగా రూపొందించింది.

నోకియా టి 20 ధర, లభ్యత
నోకియా టి 20 ట్యాబ్లెట్​ వైఫై, వైఫై ప్లస్​ 4జీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని వై-ఫై వేరియంట్ EUR 199 (సుమారు రూ. 17,200), వైఫై + 4జీ వేరియంట్​ EUR 239 (సుమారు రూ. 20,600) ధర వద్ద ప్రారంభమవుతుంది. వైఫై వేరియంట్ 3జీబీ ర్యామ్​+ 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్​+ 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. అయితే, వైఫై ప్లస్​ 4G మోడల్ మాత్రం సింగిల్​ 4 జీబీ + 64 జీబీ కాన్ఫిగరేషన్​లో లభిస్తుంది. ఈ వేరియంట్లు అక్టోబర్ 6 నుంచి అమ్మకానికి వచ్చాయి. నోకియా టి 20 ట్యాబ్లెట్​తో పాటు ఉచిత స్పాటిఫై సబ్​స్క్రిప్షన్​ లభిస్తుంది. ఇందులో 70 మిలియన్లకు పైగా పాటలు, 2.9 మిలియన్ పాడ్‌కాస్ట్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

నోకియా టి 20 స్పెసిఫికేషన్లు
నోకియా టి 20 ట్యాబ్లెట్​10.4 -అంగుళాల 2K ఇన్-సెల్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ యూనిసాక్​ T610 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 3 జీబీ, 4 జీబీ ర్యామ్, 32 జీబీ, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్‌లను అందించింది. ఫోటోలు, వీడియోల కోసం, నోకియా టి 20 ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కెమెరా, వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌లను అందించింది. దీని వెనుకవైపు ఎల్​ఈడీ ఫ్లాష్‌ కెమెరాను కూడా చేర్చింది.

ఇది కూడా చదవండి: Amazon Smart Fridge: అమెజాన్ నుంచి త్వరలోనే స్మార్ట్ ఫ్రిడ్జ్.. దీనిలోని అప్డేటెడ్ ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

నోకియా టి 20 కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 4 జి ఎల్‌టిఈ, వై-ఫై 802.11ac, బ్లూటూత్ v5.0, యూఎస్​బీ టైప్-సి, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్ వంటివి అందించింది. ఈ టాబ్లెట్​ స్టీరియో స్పీకర్లతో పాటు యాంప్లిఫైయర్​కు మద్దతిస్తుంది. నోకియా T20 8,200mAh బ్యాటరీతో వస్తుంది. 15W కంపాటబుల్ ఛార్జర్ ద్వారా ఫాస్ట్​ ఛార్జింగ్​కు మద్ధతిస్తుంది.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Latest Technology, Nokia, Tablet, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు