హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nokia T20 Tablet: ఇండియాకు రానున్న నోకియా T20 ట్యాబ్లెట్... ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

Nokia T20 Tablet: ఇండియాకు రానున్న నోకియా T20 ట్యాబ్లెట్... ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

Nokia T20 Tablet: ఇండియాకు రానున్న నోకియా T20 ట్యాబ్లెట్... ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

Nokia T20 Tablet: ఇండియాకు రానున్న నోకియా T20 ట్యాబ్లెట్... ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

Nokia T20 Tablet | సినిమాలు, వీడియోలు చూసేందుకు ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? నోకియా కొద్ది రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్‌లో లాంఛ్ చేసిన నోకియా టీ20 ట్యాబ్లెట్ (Nokia T20 Tablet) ఇండియాలో లాంఛ్ కానుంది.

ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ నోకియా మరో ట్యాబ్లెట్​ను​ (Tablet) లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నోకియా టీ20 పేరుతో దీన్ని భారత మార్కెట్​లోకి ఆవిష్కరించనుంది. నవంబర్ 3 వరకు జరగనున్న ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్​లో ఇది అమ్మకానికి రానుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌ తన టీజర్ పోస్టర్​లో నోకియా టీ20ని (Nokia T20 Tablet) లిస్ట్​లో చేర్చింది. ఇప్పటికే గ్లోబల్​ మార్కెట్​లో విడుదలైన ఈ ట్యాబ్లెట్​లో అనేక అద్భుతమైన ఫీచర్లను అందించింది. నోకియా T20 ట్యాబ్లెట్ 10.4 అంగుళాల 2K డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో వర్చువల్ ఇంటరాక్షన్‌లను సులభతరం చేసే స్టీరియో స్పీకర్లను చేర్చింది. 8,200mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ప్రత్యేక గూగుల్​ కిడ్స్​ స్పేస్ వంటి అప్​డేటెడ్​ ఫీచర్లను అందించింది.

భారత మార్కెట్​లో నోకియా T20 ధర తెలియనప్పటికీ, ఇది గ్లోబల్​ మార్కెట్​తో సమానంగా ఉండనుంది. యూరప్‌లో, నోకియా T20 వైఫై వేరియంట్​ ధర EUR 199 (దాదాపు రూ. 17,200), వైఫై + 4జీ మోడల్ ధర EUR 239 (సుమారు రూ. 20,600) నుండి ప్రారంభమవుతుంది. ఇండియాలో ధర ఎంత ఉంటుందన్న వివరాలు తెలియదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఈ ట్యాబ్లెట్ కొనొచ్చు.

Vivo Offer: కొత్త ఫోన్ కొనాలా? కేవలం రూ.101 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు


నోకియా T20 స్పెసిఫికేషన్స్


నోకియా T20 ఆండ్రాయిడ్​ 11పై పనిచేస్తుంది. దీనిలో రెండేళ్ల వారంటీ గల ఓఎస్​ అప్‌గ్రేడ్‌, మూడేళ్ల వారంటీ గల సెక్యూరిటీ ఫీచర్లను చేర్చింది. ఈ టాబ్లెట్‌లో 10.4- అంగుళాల 2K (2,000x1,200 పిక్సెల్‌లు) ఇన్-సెల్ డిస్‌ప్లేని అందించింది. ఇది 3GB ర్యామ్​, 4GB ర్యామ్​ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ట్యాబ్లెట్​ ఆక్టా-కోర్ యూనిసోక్​ T610 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. నోకియా T20 టాబ్లెట్‌లో 32GB, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్​ ఆప్షన్లతో వస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో దీని స్టోరేజ్​ను 512GB వరకు విస్తరించుకోవచ్చు.

Google Pixel 4A: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,000 తగ్గింది... ఎస్‌బీఐ కార్డుతో మరో 10 శాతం డిస్కౌంట్

ఫోటోలు, వీడియోల కోసం, దీని ముందు భాగంలో 5- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కెమెరా, వెనుకవైపు 8-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను ఇందులో అందించారు. దీని వెనుక LED ఫ్లాష్‌ కెమెరా సెటప్​ను కూడా చేర్చింది. నోకియా 8,200mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్​కు మద్దతిస్తుంది. తద్వారా ఒకే ఛార్జ్‌పై రోజంతా పనిచేస్తుంది. నోకియా T20 టాబ్లెట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 4G LTE, వైఫై 802.11ac, బ్లూటూత్ v5.0, యూఎస్​బీ టైప్- సీ, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు, యాంప్లిఫైయర్​ వంటివి చేర్చింది.

First published:

Tags: Flipkart, Flipkart Big Diwali Sale, Nokia, Tablet

ఉత్తమ కథలు