Home /News /technology /

Nokia T20: స్మార్ట్‌ఫోన్ ధరకే ట్యాబ్లెట్... ఇండియాలో రిలీజ్ అయిన నోకియా టీ20

Nokia T20: స్మార్ట్‌ఫోన్ ధరకే ట్యాబ్లెట్... ఇండియాలో రిలీజ్ అయిన నోకియా టీ20

Nokia T20: స్మార్ట్‌ఫోన్ ధరకే ట్యాబ్లెట్... ఇండియాలో రిలీజ్ అయిన నోకియా టీ20
(image: Nokia India)

Nokia T20: స్మార్ట్‌ఫోన్ ధరకే ట్యాబ్లెట్... ఇండియాలో రిలీజ్ అయిన నోకియా టీ20 (image: Nokia India)

Nokia T20 | నోకియా టీ20 ట్యాబ్లెట్ ఇండియాలో రిలీజ్ అయింది. భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, అదిరిపోయే స్పీకర్స్... ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి. నోకియా టీ20 ట్యాబ్లెట్ ప్రత్యేకతలు తెలుసుకోండి.

    సినిమాలు, వీడియోలు చూసేందుకు ట్యాబ్లెట్ (Tablet) కోసం సెర్చ్ చేస్తున్నారా? ఆన్‌లైన్ కోర్సుల కోసం ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? ఇండియాలో నోకియా ట్యాబ్లెట్‌ను పరిచయం చేసింది. నోకియా టీ20 (Nokia T20) ట్యాబ్లెట్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్యాబ్లెట్ కొన్నాళ్ల క్రితమే గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయింది. ఈ ట్యాబ్లెట్ ఇండియాకు ఎప్పుడు వస్తుందా అని నోకియా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ ట్యాబ్‌ను ఇండియాకు తీసుకొచ్చింది నోకియా. ఈ ట్యాబ్లెట్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. 3జీబీ+32జీబీ స్టోరేజ్, 4జీబీ+64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ మోడల్‌ను రిలీజ్ చేసింది నోకియా. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.15,499 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,499. కేవలం వైఫై సపోర్ట్‌తో మాత్రమే నోకియా టీ20 ట్యాబ్లెట్ లభిస్తుంది.

    నోకియా టీ20 ట్యాబ్లెట్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 10.4 అంగుళాల 2కే ఇన్ సెల్ డిస్‌ప్లే ఉంది. టఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. 3జీబీ+32జీబీ స్టోరేజ్, 4జీబీ+64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రిలీజ్ అయింది. మెమొరీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. నోకియా టీ20 ట్యాబ్లెట్‌లో 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రియర్ కెమెరాతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. డ్యూయెల్ స్పీకర్స్ ఓజో ప్లేబ్యాక్ సపోర్ట్ ఉంది.

    JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలా? నెలకు రూ.300 చాలు


    నోకియా టీ20 ట్యాబ్లెట్ 4జీఎల్‌టీఈ మోడల్ కూడా ఉంది. ఇండియాలో ఈ మోడల్ రిలీజ్ కాలేదు. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే వైఫై డ్యూయెల్ బ్యాండ్, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ బరువు 465 గ్రాములు. నోకియా టీ20 ట్యాబ్లెట్‌లో 8,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో 10వాట్ ఛార్జర్ మాత్రమే లభిస్తుంది.

    WhatsApp: అలర్ట్... ఈరోజు నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు

    నోకియా టీ20 ట్యాబ్లెట్‌లో గూగుల్ కిడ్స్ స్పేస్ ప్రీలోడెడ్‌గా వస్తుంది. పిల్లల గూగుల్ అకౌంట్‌తో పనిచేస్తుంది. తల్లిదండ్రులు ఫ్యామిలీ లింక్ పేరెంట్ కంట్రోల్స్‌తో గూగుల్ చిల్డ్రన్స్‌ అకౌంట్ మేనేజ్ చేయొచ్చు. నోకియా టీ20 ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని హెచ్ఎండీ గ్లోబల్ చెబుతోంది. ఈ ట్యాబ్లెట్‌ను డీప్ ఓషియన్, ఓషియన్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Nokia, Tablet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు