Home /News /technology /

Nokia T20 vs Realme Pad: రూ.15,000 బడ్జెట్‌లో నోకియా, రియల్‌మీ ట్యాబ్లెట్స్... వీటిలో ఏది బెస్ట్

Nokia T20 vs Realme Pad: రూ.15,000 బడ్జెట్‌లో నోకియా, రియల్‌మీ ట్యాబ్లెట్స్... వీటిలో ఏది బెస్ట్

Nokia T20 vs Realme Pad: రూ.15,000 బడ్జెట్‌లో నోకియా, రియల్‌మీ ట్యాబ్లెట్స్... వీటిలో ఏది బెస్ట్

Nokia T20 vs Realme Pad: రూ.15,000 బడ్జెట్‌లో నోకియా, రియల్‌మీ ట్యాబ్లెట్స్... వీటిలో ఏది బెస్ట్

Nokia T20 vs Realme Pad | సినిమాలు చూసేందుకు లేదా ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? నోకియా, రియల్‌మీ ట్యాబ్లెట్స్ ఇటీవల రిలీజ్ అయ్యాయి. నోకియా టీ20 (Nokia T20), రియల్‌మీ ప్యాడ్ (Realme Pad) ట్యాబ్లెట్స్‌లో ఏది బెస్ట్ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    హెచ్ఎండీ గ్లోబల్ తొలిసారిగా ఇండియాలో నోకియా టీ20 (Nokia T20) ట్యాబ్లెట్‌ను రిలీజ్ చేసింది. రూ.15,000 బడ్జెట్‌లో ఈ ట్యాబ్లెట్ రిలీజ్ అయింది. అయితే రెండు నెలల క్రితం రియల్‌మీ కూడా ఇండియాలో తొలి ట్యాబ్లెట్‌ను పరిచయం చేయడం విశేషం. రియల్‌మీ ప్యాడ్ (Realme Pad) పేరుతో ఈ ట్యాబ్లెట్ రిలీజ్ అయింది. ఇది కూడా రూ.15,000 బడ్జెట్‌లో వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఆన్‌లైన్ క్లాసుల కోసం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ట్యాబ్లెట్స్ కొనేవారి సంఖ్య పెరిగింది. దీంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ ట్యాబ్లెట్ల ద్వారా యూజర్లను టార్గెట్ చేస్తున్నాయి. మరి రూ.15,000 సెగ్మెంట్‌లో రిలీజ్ అయిన నోకియా టీ20, రియల్‌మీ ప్యాడ్ మధ్య తేడాలేంటీ, వీటిలో ఏది బెస్ట్ ట్యాబ్లెట్ తెలుసుకోండి.

    Dislplay: నోకియా టీ20 ట్యాబ్లెట్‌లో 10.4 అంగుళాల 2కే ఇన్ సెల్ డిస్‌ప్లే ఉంది. టఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఇక రియల్‌మీ ప్యాడ్ ట్యాబ్లెట్‌లో 10.4 అంగుళాల WUXGA+ డిస్‌ప్లే ఉంది. ఈ రెండు ట్యాబ్లెట్స్‌లో డిస్‌ప్లే సైజ్ ఒకేలా ఉంది.

    Realme Festive Days: రియల్‌మీ ఫెస్టీవ్ డేస్ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్

    RAM and Internal Storage: నోకియా టీ20 ట్యాబ్లెట్ 3జీబీ+32జీబీ స్టోరేజ్, 4జీబీ+64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రిలీజ్ అయింది. మెమొరీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. రియల్‌మీ ప్యాడ్ కూడా 3జీబీ+32జీబీ స్టోరేజ్, 4జీబీ+64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. నోకియా టీ20, రియల్‌మీ ప్యాడ్ ట్యాబ్లెట్స్ వైఫై వేరియంట్‌తో పాటు ఎల్‌టీఈ వేరియంట్లలో రిలీజ్ అయ్యాయి.

    Processor: నోకియా టీ20 ట్యాబ్లెట్ యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ ప్యాడ్ ట్యాబ్లెట్‌లో మీడియాటెక్ హీలియో జీ80 గేమింగ్ ప్రాసెసర్ ఉంది. వీటిలో మీడియాటెక్ హీలియో జీ80 పాపులర్ ప్రాసెసర్.

    Camera: నోకియా టీ20 ట్యాబ్లెట్‌లో 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రియర్ కెమెరాతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. రియల్‌మీ ప్యాడ్‌లో ముందువైపు, వెనుకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండటం విశేషం.

    JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్స్ ఇవే...

    Battery: నోకియా టీ20 ట్యాబ్లెట్‌లో 8,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో 10వాట్ ఛార్జర్ మాత్రమే లభిస్తుంది. ఇక రియల్‌మీ ప్యాడ్‌లో 7,100ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. రియల్‌మీ ప్యాడ్‌లో బ్యాటరీ తక్కువైనా ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 18వాట్ ఛార్జల్ లభిస్తుంది.

    Operating System: నోకియా టీ20 ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని హెచ్ఎండీ గ్లోబల్ చెబుతోంది. ఇక రియల్‌మీ ప్యాడ్ ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

    Price: నోకియా టీ20 ట్యాబ్లెట్ 3జీబీ+32జీబీ వైఫై వేరియంట్ ధర రూ.15,499 కాగా, 4జీబీ+64జీబీ వైఫై వేరియంట్ ధర రూ.16,499. ఇక 4జీబీ+64జీబీ వైఫై+ఎల్‌టీఈ వేరియంట్ ధర రూ.18,499. ఇక రియల్‌మీ ప్యాడ్ 3జీబీ+32జీబీ వైఫై వేరియంట్ ధర రూ.13,999 కాగా, 3జీబీ+32జీబీ వైఫై+ఎల్‌టీఈ వేరియంట్ ధర రూ.15,999. ఇక 4జీబీ+64జీబీ వైఫై+ఎల్‌టీఈ వేరియంట్ ధర రూ.17,999.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Nokia, Realme, Tablet

    తదుపరి వార్తలు