హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nokia T10 Tablet: నోకియా నుంచి కొత్త టాబ్లెట్.. రూ.15వేలలో బెస్ట్ ఫీచర్లతో ‘నోకియా T10’ రిలీజ్

Nokia T10 Tablet: నోకియా నుంచి కొత్త టాబ్లెట్.. రూ.15వేలలో బెస్ట్ ఫీచర్లతో ‘నోకియా T10’ రిలీజ్

నోకియా కొత్త T10 మోడల్

నోకియా కొత్త T10 మోడల్

Nokia: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు నోకియా (Nokia) భారతదేశంలోని సరికొత్త మొబైల్స్‌తో పాటు బడ్జెట్ టాబ్లెట్‌లను రిలీజ్ చేస్తోంది. తాజాగా మరో అదిరిపోయే టాబ్లెట్‌ను కూడా అందుబాటు ధరల్లోనే రిలీజ్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Delhi, India

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు నోకియా (Nokia) భారతదేశంలోని సరికొత్త మొబైల్స్‌తో పాటు బడ్జెట్ టాబ్లెట్‌లను రిలీజ్ చేస్తోంది. తాజాగా మరో అదిరిపోయే టాబ్లెట్‌ను కూడా అందుబాటు ధరల్లోనే రిలీజ్ చేసింది. నోకియా టీ10 (Nokia T10)గా పిలిచే ఈ సరికొత్త టాబ్లెట్‌ను రెండు స్టోరేజ్ వేరియంట్లలో కంపెనీ రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ టాబ్లెట్‌ను నోకియా ఇండియా (Nokia India) అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ (Amazon) వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇండియాలో విడుదలైన ఈ మోడల్ WiFi ఎనేబుల్డ్‌ కాగా త్వరలో LTE+Wi-Fi వేరియంట్‌ను కూడా పరిచయం చేయనున్నట్లు నోకియా తెలిపింది. మరి నోకియా టీ10లో అందించిన ఫీచర్లు ఏవి? ఏయే వేరియంట్లు ఎంత ధరతో వస్తున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

* నోకియా T10 టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

నోకియా T10 టాబ్లెట్‌లో 8-అంగుళాల HD డిస్‌ప్లేను ఆఫర్ చేశారు. ఈ డిస్‌ప్లే యూజర్లకు 1280×800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పాటు 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. Android 12 OSపై నడిచే ఈ టాబ్లెట్‌కి రెండు మేజర్ OS అప్‌డేట్లు, మూడు ఏళ్ల పాటు మంత్లీ సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఈ టాబ్లెట్‌ Unisoc T606 ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుంది. T10 టాప్ వేరియంట్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో అందించిన మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి 512GB వరకు స్టోరేజ్‌ను ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. టాబ్లెట్‌ బరువు 375 గ్రాములు అని కంపెనీ పేర్కొంది. ఇది పాలికార్బోనేట్‌ బ్యాక్ ప్యానెల్‌తో లాంచ్ అయింది.

బ్యాక్‌సైడ్ 8MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ 2MP సెల్ఫీ కెమెరాతో విడుదలైన ఈ టాబ్లెట్ 5,250mAh బ్యాటరీ వస్తుంది. 10 వాట్ ఛార్జింగ్‌కి సపోర్ట్‌ ఇస్తుంది. ఇందులో OZO ప్లేబ్యాక్ బేస్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, బయోమెట్రిక్ ఫేస్ అన్‌లాక్, IPX2 స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్, గూగుల్ కిడ్స్ స్పేస్, ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, ఇన్‌బిల్ట్ GPS ఉన్నాయి.

నోకియా T20 టాబ్లెట్ గతేడాది ఇండియాలో రిలీజ్ అయింది. ఇప్పుడు టీ సిరీస్‌లో మరో టాబ్లెట్‌ను కంపెనీ తీసుకొచ్చింది. అయితే ఈ T10 టాబ్లెట్‌ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది 10-15 ప్రైస్ సెగ్మెంట్‌లో రియల్‌మీ , ఒప్పో , కొన్ని ఇతర బ్రాండ్స్‌కు పోటీగా నిలవనుంది.

* నోకియా T10 టాబ్లెట్ ధర

నోకియా T10 టాబ్లెట్ 3GB + 32GB మోడల్ రూ.11,799 ధరతో రిలీజ్ అయింది. 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,799 ధరతో అందుబాటులోకి వచ్చింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Mobile phones, Nokia

ఉత్తమ కథలు