ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నోకియా ఇండియాలో సరికొత్త ల్యాప్‌టాప్ లాంఛ్ చేసింది. ఇందులో భాగంగానే Nokia PureBook X14 పేరుతో మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. త్వరలోనే తమ భాగస్వామ్యంలో మరికొన్ని ల్యాప్టాప్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తన వెబ్సైట్లో పేర్కొంది. 8 జీబీ ర్యామ్‌తో వచ్చే Nokia PureBook X14 ల్యాప్‌టాప్ ధర రూ.59,990. ఇందులో 14 అంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది. డాల్బీ విజన్, అల్ట్రా పిక్చర్ క్వాలిటీ, ఇంటెల్ కోర్ ఐ5 10వ జనరేషన్ కోర్ ప్రాసెసర్, 8GB DDR4 RAM, 512 జీబీ ఎస్ఎస్ఈడీ తదితర ఫీచర్లను ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. దీని బరువు కేవలం 1.1 కిలోలు. బ్లాక్ కలర్ ఆప్షన్లో ఈ ల్యాప్‌టాప్ నోట్‌బుక్ సైజ్‌లో ఉంటుంది. అంతేకాక, దీనిలో చిక్లెట్–స్టయిల్ కీబోర్డ్, మల్టీ టచ్‌తో పెద్ద టచ్ ప్యాడ్‌ను అందించనున్నారు.
నోకియా ప్యూర్‌బుక్ X14 ఇంటెల్ ఐ5 ప్రాసెసర్(processor )తో వస్తుంది. 4.2GHz టర్బో ఫ్రీక్వెన్సీతో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ 8GB DDR4 ర్యామ్, 512GB NVMe SSD స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది. అంతేకాక, 1.1 GHz టర్బో GPUతో ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ UHD 620 గ్రాఫిక్స్‌ను కూడా దీనిలో అందించనున్నారు. విండోస్ 10 ప్రీ ఇన్స్టాల్ చేయబడి ఉన్న ఈ ల్యాప్‌టాప్ 8 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. విండోస్ హలో ఫేస్ అన్‌లాక్‌తో కూడిన HD IR వెబ్‌క్యామ్, బ్యాక్లిట్ కీబోర్డ్, మల్టిపుల్ గెస్చర్ ఆప్షన్స్‌ను కూడా దీనిలో అందించారు. దీనిపై నోకియా బ్రాండ్ వైస్ ప్రెసిడెంట్ విపుల్ మెహ్రోత్రా మాట్లాడుతూ " భారతీయ వినియోగదారులకు నోకియా బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌ను అందించడానికి ఫ్లిప్‌కార్ట్ మాతో జతకట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇది మార్కెట్లో నూతన ఆవిష్కరణకు నాంది పలుకుతుంది. నోకియా బ్రాండ్ అంటే ఉత్తమ పనితీరుకు, విశ్వసనీయతకు ప్రసిద్ధి. మా భాగస్వామ్యంలో భవిష్యత్తులో మరిన్ని ల్యాప్‌టాప్‌లను తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నాం. " అని అన్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.