ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి మరో నోకియా స్మార్ట్ టీవీ వచ్చేసింది. ఇది రెండో నోకియా స్మార్ట్ టీవీ. 43 అంగుళాల 4కే టీవీ ఇది. ధర రూ.31,999. కేవలం ఒకే వేరియంట్‌తో నోకియా స్మార్ట్ టీవీ రిలీజైంది. జూన్ 8 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది. ఇక టీవీ విశేషాలు చూస్తే 43 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ ఎల్ఈడీ డిస్‌ప్లే ఉండటం విశేషం. డాల్బీ విజన్ సపోర్ట్, 60Hz రిఫ్రెష్ రేట్, 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4కే తో పాటు హెచ్‌డీఆర్ కంటెంట్ సపోర్ట్ కూడా ఉంది. CA53 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2.25జీబీ ర్యామ్ ఉండగా, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. ఆండ్రాయిడ్ 9.0తో టీవీ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ యాప్స్ ఉంటాయి. నోకియా స్మార్ట్ టీవీలో క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ ఉండటం విశేషం.
నోకియా స్మార్ట్ టీవీ కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 2.4GHz వైఫై సపోర్ట్, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, బ్లూటూత్ 5.0 ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వాయిస్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక గతంలో నోకియా నుంచి 55 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో స్మార్ట్ టీవీ రిలీజైన సంగతి తెలిసిందే. 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.41,999.
ఇవి కూడా చదవండి:
BSNL: రూ.365 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ... బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
Jio offer: జియో రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసేవారికి ఈ ఆఫర్స్
Oppo: ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android TV, Nokia, Smart TV, Tech