Nokia Smartphones: నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర రూ.7,499 నుంచి

Nokia Smartphones | నోకియా నుంచి 4 ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. రెండు స్మార్ట్‌ఫోన్లు, రెండు ఫీచర్ ఫోన్లను పరిచయం చేసింది నోకియా. వీటి ధరతో పాటు స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: August 26, 2020, 10:59 AM IST
Nokia Smartphones: నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర రూ.7,499 నుంచి
Nokia Smartphones: నోకియా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర రూ.7,499 నుంచి (image: Nokia India)
  • Share this:
నోకియా... ఒకప్పుడు ఫీచర్ ఫోన్లలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించిన కంపెనీ. కానీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మాత్రం చతికిలబడింది. సాంసంగ్‌తో పాటు షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో, మోటోరోలా లాంటి కంపెనీల దూకుడును తట్టుకోలేకపోయింది. ఇటీవల నోకియా తన స్మార్ట్‌ఫోన్ లైనప్‌పై ఎక్కువగా దృష్టిపెట్టింది. ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కొత్తకొత్త స్మార్ట్‌‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు ఇండియాలో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను, రెండు ఫీచర్ ఫోన్లను పరిచయం చేసింది. నోకియా 5.3, నోకియా సీ3 స్మార్ట్‌ఫోన్లతో పాటు నోకియా 125, నోకియా 150 ఫీచర్ ఫోన్లు ఇండియాకు వచ్చేశాయి. ఒకేసారి 4 ఫోన్లను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. వీటిలో నోకియా 5.3 ధర రూ.13,999 కాగా, నోకియా సీ3 ధర రూ.7,499. నోకియా 5.3 సేల్ సెప్టెంబర్ 1న ప్రారంభమవుతుంది. నోకియా సీ3 స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 17 నుంచి కొనొచ్చు.


నోకియా 5.3 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.55 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665
రియర్ కెమెరా: 13+2+5+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్+ఎస్‌డీ కార్డ్
ధర:
4జీబీ+64జీబీ- రూ.13,999
6జీబీ+64జీబీ- రూ.14,499


నోకియా సీ3 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 హెచ్‌డీ+ డిస్‌ప్లే
ర్యామ్: 2జీబీ, 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,040ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్+ఎస్‌డీ కార్డ్
ధర:
2జీబీ+32జీబీ- రూ.7,499
3జీబీ+32జీబీ- రూ.8,999

ఇక నోకియా 150, నోకియా 125 ఫీచర్స్ ఫోన్స్ కూడా రిలీజ్ అయ్యాయి. నోకియా 150 ఫోన్‌లో 2.4 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ చిప్, డ్యూయెల్ సిమ్ సపోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో వీజీఏ కెమెరా కూడా ఉంది. ధర రూ.2,299. నోకియా 125 ఫోన్ ఫీచర్స్ అన్నీ నోకియా 150 లాగానే ఉంటాయి. కానీ కెమెరా ఉండదు. ధర రూ.1,999.
Published by: Santhosh Kumar S
First published: August 26, 2020, 10:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading