Home /News /technology /

Nokia PureBook S14: ల్యాప్‌టాప్‌, స్మార్ట్​టీవీ లాంఛ్ చేసిన నోకియా... ధర ఎంతంటే

Nokia PureBook S14: ల్యాప్‌టాప్‌, స్మార్ట్​టీవీ లాంఛ్ చేసిన నోకియా... ధర ఎంతంటే

Nokia PureBook S14: ల్యాప్‌టాప్‌, స్మార్ట్​టీవీ లాంఛ్ చేసిన నోకియా... ధర ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Nokia PureBook S14: ల్యాప్‌టాప్‌, స్మార్ట్​టీవీ లాంఛ్ చేసిన నోకియా... ధర ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Nokia PureBook S14 | నోకియా నుంచి ప్యూర్‌బుక్ ఎస్14 ల్యాప్‌టాప్‌తో పాటు స్మార్ట్ టీవీ (Smart TV) లాంఛ్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

భారత మార్కెట్​లో పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు నోకియా తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకే ఇటీవలి కాలంలో వరుసగా స్మార్ట్​ఉత్పత్తులను రిలీజ్​ చేస్తోంది. నోకియా తాజాగా ప్యూర్‌బుక్ ఎస్ 14 (PureBook S14) ల్యాప్‌టాప్, కొత్త నోకియా స్మార్ట్ టీవీ (Nokia Smart TV) సిరీస్​ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. ఈ రెండు ఉత్పత్తులు అక్టోబర్ 3 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్​లో తొలిసారి అమ్మకానికి రానున్నాయి. నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14.. విండోస్ 11పై రన్ అవుతుంది. ఈ ల్యాప్​ట్యాప్​లో 11 జెన్​ ఇంటెల్​ కోర్​ ప్రాసెసర్​ను అందించారు. మరోవైపు, నోకియా స్మార్ట్​ టీవీ మోడల్స్​ ఆండ్రాయిడ్​ 11 ఆపరేటింగ్​ సిస్టమ్​ సహాయంతో పనిచేస్తాయి. ఈ స్మార్ట్ టీవీలు 50 అంగుళాలు, 55 -అంగుళాల డిస్‌ప్లేతో వస్తాయి. ఈ రెండు మోడల్స్ ఫుల్​ హెచ్​డీ, అల్ట్రా హెచ్​డీ, క్యూఎల్​ఈడీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14, నోకియా స్మార్ట్ టీవీ ధర


కొత్త నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్ రూ. 56, 990 ధర వద్ద లభిస్తుంది. ఇది అక్టోబర్ 3న ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకానికి వస్తుంది. నోకియా క్యూఎల్​ఈడీ స్మార్ట్​ టీవీ 50 అంగుళాల మోడల్​ రూ. 44,999, 55- అంగుళాల మోడల్​​ రూ. 49,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ముందే మొదలైన స్మార్ట్‌ఫోన్ సేల్... ఈ 15 మొబైల్స్‌పై డిస్కౌంట్

నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 స్పెసిఫికేషన్లు


నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 విండోస్ 11పై నడుస్తుంది. దీనిలో ఐరిస్ ఎక్స్​ఈ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో కూడిన 11వ జెన్ ఇంటెల్ కోర్ i5 సీపీయూ ప్రాసెసర్​ను అందించింది. ఇది డాల్బీ అట్మోస్ సపోర్ట్​ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల ఫుల్-హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 16 జీబీ ర్యామ్​, 512 జీబీ ఎస్​ఎస్​డీ స్టోరేజ్​ని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. యూఎస్​బీ టైప్-సి పోర్ట్, HDMI పోర్ట్, 3.0 యూఎస్​బీ టైప్-ఎ పోర్ట్ వంటివి అందించింది. వీటితో పాటు కెమెరా, టాప్ ఫైరింగ్ స్పీకర్లకు ప్రైవసీ స్విచ్​ను అమర్చింది.

Reliance Jio: జియో రీఛార్జ్‌పై 20 శాతం క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి

నోకియా స్మార్ట్ టీవీ ఫీచర్లు


కొత్త నోకియా స్మార్ట్ టీవీ మోడల్స్ ఆండ్రాయిడ్ 11తో పనిచేస్తాయి. ఈ క్యూఎల్​ఈడీ మోడల్స్ 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 -అంగుళాల డిస్‌ప్లేతో వస్తాయి. ఈ స్మార్ట్ టీవీలో జేబీఎల్​ స్పీకర్లను అందించారు. ఇది హర్మన్ ఆడియో ఈఎఫ్ఎక్స్ ట్యూన్​తో వస్తుంది. దీనిలో 60W ట్విన్ స్పీకర్లు, డాల్బీ విజన్ + హెచ్​డీఆర్​10, డాల్బీ అట్మోస్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, డేటా సేవర్ వంటి ఫీచర్లను జోడించింది. నోకియా క్యూఎల్​ఈడీ స్మార్ట్ టీవీలు క్వాంటం డాట్ టెక్నాలజీతో రూపొందాయి. వీటిలో యాక్టివ్ క్వాంటం డాట్ ఫిల్టర్, LED ఐ ప్రొటెక్షన్​ మోడ్‌ను అందించింది.. నోకియా స్మార్ట్ టీవీలో 2GB ర్యామ్​, 16GB ఇంటర్నల్ స్టోరేజ్​ని అందించింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Laptop, Nokia, Smart TV

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు