ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న నోకియా... మరో రెండు స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. నోకియా 5.4, నోకియా 3.4 మోడల్స్‌ని ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్, నోకియా 3.4 మోడల్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. త్వరలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ లభిస్తుంది. నోకియా 5.4, నోకియా 3.4 గతంలోనే ఇతర దేశాల్లో రిలీజ్ అయ్యాయి. వీటిని ఇండియాకు తీసుకొస్తామని గతంలోనే ప్రకటించింది నోకియా. టీజర్లతో ఊరిస్తోంది. నోకియా 5.4 ప్రారంభ ధర రూ.13,999 కాగా, నోకియా 3.4 ధర రూ.11,999. నోకియా వెబ్సైట్లో ప్రీబుకింగ్ మొదలైంది. ఫిబ్రవరి 17న నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20 నుంచి నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. నోకియా వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రీటైల్ ఔట్‌లెట్స్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.
నోకియా 3.4 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్డీ+
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ (5వాట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: చార్కోల్, డస్క్, ఎఫ్జార్డ్
ధర:
4జీబీ+64జీబీ- రూ.11,999
New Smartphones in 2021: కొత్త ఫోన్ కొనాలా? 2021లో రిలీజైన స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Password: అలర్ట్... ఈ 20 పాస్వర్డ్స్ ఉపయోగిస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ
Be it day or night, capture everything in sight with amazing Nokia 5.4. To know more, visit: https://t.co/x0pFTG6lJg#Nokia5dot4 pic.twitter.com/bTq7VCuWdk
— Nokia Mobile India (@NokiamobileIN) February 9, 2021
నోకియా 5.4 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్డీ+
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ (10వాట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: డస్క్, పోలార్ నైట్
ధర:
4జీబీ+64జీబీ- రూ.13,999
6జీబీ+64జీబీ- రూ.15,499
Paytm: పేటీఎంలో కొత్త ఫీచర్... క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లిస్తే రూ.1,000 క్యాష్ బ్యాక్
WhatsApp: వాట్సప్ నుంచి మ్యూట్ వీడియో ఫీచర్... ఎలా పనిచేస్తుందంటే
ఇక నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్ కూడా లాంఛ్ అయ్యాయి. చార్కోల్, స్నో కలర్స్‌తో కొనొచ్చు. ధర రూ.3,599. ఫిబ్రవరి 17న సేల్ మొదలవుతుంది. నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్‌తో కలిపి కొంటే రూ.1,600 డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక కొద్ది రోజుల క్రితం నోకియా 2.4 ఇండియాలో రిలీజైంది. 3జీబీ వేరియంట్ ధర రూ.10,399. నోకియా నుంచి వచ్చే మోడల్స్ అన్నీ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్సే. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లో కేవలం గూగుల్‌కు సంబంధించిన యాప్స్ మాత్రమే ఉంటాయి. థర్ట్ పార్టీ యాప్స్, బ్లోట్‌వేర్ ఉండదు. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, సెక్యూరిటీ అఫ్డేట్స్ లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile, Mobile News, Mobiles, Nokia, Smartphone, Smartphones