Nokia XR20: నోకియా రగ్డ్ మొబైల్ ఇండియాకు వచ్చేస్తోంది... రిలీజ్ ఎప్పుడంటే

Nokia XR20: నోకియా రగ్డ్ మొబైల్ ఇండియాకు వచ్చేస్తోంది... రిలీజ్ ఎప్పుడంటే (image: Nokia India)

Nokia XR20 | నోకియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. నోకియా జూలైలో లాంఛ్ చేసిన రగ్జ్ మొబైల్ నోకియా ఎక్స్ఆర్20 (Nokia XR20) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి.

  • Share this:
    నోకియా జూలైలో రిలీజ్ చేసిన ఓ స్మార్ట్‌ఫోన్ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ స్మార్ట్‌ఫోన్ కిందపడ్డా ఏమీ కాదు. ప్రొటెక్షన్ కోసం కేస్ అవసరం లేదు. మిలిటరీ గ్రేడ్ వాటర్ ప్రూఫ్ సామర్థ్యంతో తయారైన స్మార్ట్‌ఫోన్ అది. నోకియా తయారు చేసిన రగ్డ్ మొబైల్ (Rugged Mobile) మోడల్ పేరు నోకియా ఎక్స్ఆర్20 (Nokia XR20). ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగల లైఫ్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్ఆర్20. నోకియా ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసినప్పటి నుంచి ఈ మొబైల్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు నోకియా ఫ్యాన్స్. నోకియా ఎక్స్ఆర్20 (Nokia XR20) స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది. అక్టోబర్ 20న ప్రీ-బుకింగ్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ కానుందని నోకియా ఇండియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.


    నోకియా ఎక్స్ఆర్20 ఫీచర్స్


    నోకియా ఎక్స్ఆర్20 ప్రత్యేకతలు చూస్తే వాటర్‌ప్రూఫ్, షాక్‌ప్రూఫ్ బాడీతో ఈ స్మార్ట్‌ఫోన్ తయారైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న రగ్డ్‌ కేస్‌కు మిలిటరీ గ్రేడ్ మన్నిక ఉండటం విశేషం. నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్ 1.8 మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డా పగిలిపోదు. నీటిలో ముంచినా, మట్టిలో పడిపోయినా ఏమీ కాదు. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్‌ప్రూఫింగ్ కోసం ఐపీ68 సర్టిఫికెట్ ఉంది.

    Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్

    ఈరోజుల్లో ప్రతీ స్మార్ట్‌ఫోన్‌కు కేస్ కొనడం అలవాటు. నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్‌కు అసలు కేసే అవసరం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉండటం విశేషం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్ స్క్రీన్ ప్రొటెక్షన్‌లో ఇదే డ్యూరబుల్ గ్లాస్ కావడం విశేషం.

    నోకియా ఎక్స్ఆర్20 స్పెసిఫికేషన్స్


    నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రిలీజ్ అయింది. ఇండియాలో 4జీబీ+64జీబీ ధర సుమారు రూ.43,600 ఉండొచ్చని అంచనా. హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.50,600 ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రానైట్, అల్‌ట్రా బ్లూ కలర్స్‌లో రిలీజ్ అయింది. నోకియా ఎక్స్ఆర్20 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు నాలుగేళ్ల పాటు మంత్లీ సెక్యూరిటీ అప్‌డేట్స్, మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్స్ లభిస్తాయని గతంలోనే నోకియా ప్రకటించింది.

    Banned Apps: మరిన్ని యాప్స్ బ్యాన్ చేసిన గూగుల్... ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా?

    నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 13 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరాలు ZEISS టెక్నాలజీతో పనిచేస్తాయి. సెల్ఫీలు, వీడియోల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. స్టీరియో స్పీకర్లకు ఓజో ఆడియో సపోర్ట్ చేస్తుంది. నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్‌లో 4630ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 18వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్-సీ పోర్ట్ ఉంది. ఈ ఫోన్ బరువు 248గ్రాములు. అల్‌ట్రా బ్లూ, గ్రానైట్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 248 గ్రాములు.
    Published by:Santhosh Kumar S
    First published: