హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nokia G60 5G: పాపులర్ ప్రాసెసర్‌తో నోకియా నుంచి కొత్త 5జీ ఫోన్ రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

Nokia G60 5G: పాపులర్ ప్రాసెసర్‌తో నోకియా నుంచి కొత్త 5జీ ఫోన్ రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

Nokia G60 5G: పాపులర్ ప్రాసెసర్‌తో నోకియా నుంచి కొత్త 5జీ ఫోన్ రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

Nokia G60 5G: పాపులర్ ప్రాసెసర్‌తో నోకియా నుంచి కొత్త 5జీ ఫోన్ రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

Nokia G60 5G | నోకియా నుంచి పాపులర్ ప్రాసెసర్‌తో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.3,599 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితంగా పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

హెచ్ఎండీ గ్లోబల్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో 5జీ మొబైల్‌ను (5G Mobile) రిలీజ్ చేసింది. నోకియా జీ60 5జీ (Nokia G60 5G) మోడల్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఇటీవల పాపులర్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ (Qualcomm Snapdragon 695 5G) ప్రాసెసర్ ఉండటం విశేషం. 120Hz డిస్‌ప్లే, 4,500mAh బ్యాటరీ, రెండు రోజుల బ్యాటరీ లైఫ్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే నోకియా జీ60 5జీ మొబైల్ రిలీజైంది. ధర రూ.29,999. ప్రీ-ఆర్డర్స్ నవంబర్ 8న ప్రారంభం అవుతాయి. నోకియా జీ60 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.3,599 విలువైన నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్ ఉచితంగా లభిస్తుంది. బ్లాక్, ఐస్ కలర్స్‌లో కొనొచ్చు.

నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్

నోకియా జీ60 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల పాపులర్ అయిన 5జీ ప్రాసెసర్ ఇది. మోటో జీ62, వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్, పోకో ఎక్స్4 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో+, ఐకూ జెడ్6, రియల్‌మీ 9 ప్రో లాంటి మొబైల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది.

Numbers Blocking: ఆండ్రాయిడ్ ఫోన్‌లో గుర్తుతెలియని నెంబర్స్‌ని సింపుల్‌గా బ్లాక్ చేయండిలా

నోకియా జీ60 5జీ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. ఇతర బ్లోట్‌వేర్, జంక్‌వేర్ ఉండదు. మూడు ఓఎస్ అప్‌గ్రేడ్స్, మూడేళ్ల పాటు మంత్లీ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని నోకియా ప్రకటించింది. అంటే ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్‌డేట్ కూడా నోకియా జీ60 స్మార్ట్‌ఫోన్‌కు లభిస్తుంది.

నోకియా జీ60 5జీ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 5మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. నైట్ మోడ్ 2.0, డార్క్ విజన్, ఏఐ పోర్ట్‌రైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Mobile Offer: రూ.30 వేల లోపు రిలీజైన మొబైల్‌ను రూ.15 వేల లోపే కొనండి

నోకియా జీ60 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500mAh బ్యాటరీ ఉంది. 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 2 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఎన్ఎఫ్‌సీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

First published:

Tags: Nokia, Smartphone

ఉత్తమ కథలు