Nokia G50: నోకియా G50 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్.. 48 ఎంపీ ట్రిపుల్​ రియర్​ కెమెరా​తో పాటు మరెన్నో ఫీచర్లు

ప్రతీకాత్మక చిత్రం

Nokia G50 5G Smart Phone: నోకియా జి 50 ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్​పై నడుస్తుంది. ఇది 6.82 -అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది.

  • Share this:
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ నోకియా (Nokia) మిడ్​రేంజ్​లో నోకియా జీ 50 (Nokia G50) స్మార్ట్​ఫోన్‌ను లాంచ్​ చేసింది. నోకియా జీ సిరీస్​లో రిలీజైన ఈ స్మార్ట్​ఫోన్​లో అద్భుతమైన ఫీచర్లను జోడించింది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. నోకియా జీ 50 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్‌తో రానుంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ( octa core qualcomm snapdragon) 480 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఇది​ యూకే మార్కెట్‌లోనే రిలీజ్ అయింది. భారత్​తో సహా ఇతర గ్లోబల్​ మార్కెట్​లో లాంచింగ్​పై స్పష్టత లేదు. అయితే త్వరలోనే భారత్​లో లాంచ్​ అయ్యే అవకాశం ఉందని నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే నోకియా జీ సిరీస్​లో జీ10, జీ 20 వంటి 4జీ స్మార్ట్​ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన ఈ కొత్త 5జీ స్మార్ట్​ ఫోన్ చేరింది.

Redmi 9 Activ: సైలెంట్‌గా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... ఫీచర్స్ ఇవే

నోకియా జీ 50 ధర, లభ్యత

నోకియా G50 సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని 4GB ర్యామ్​ + 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్​ GBP 199.99 (సుమారు రూ. 20,100) వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ మిడ్‌నైట్ సన్, ఓషన్ బ్లూ కలర్​ ఆప్షన్లలో వస్తుంది.

Vivo V20 Pro: రూ.30 వేల 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10 వేలకే సొంతం చేసుకోండి.. అమెజాన్‌లో ఆఫర్

నోకియా జీ 50 స్పెసిఫికేషన్లు

నోకియా జి 50 ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్​పై నడుస్తుంది. ఇది 6.82 -అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. నోకియా జి 50 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్​, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలను చేర్చింది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, నోకియా G50 ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ కెమెరాను అందించింది.

Infinix: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఇవే

నోకియా G50లో 64 జీబీ ఆన్​బోర్ట్ స్టోరేజ్​ను సంస్థ అందించింది. అయితే, మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను 512GB వరకు విస్తరించుకోవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. ఇది 5జీ, 4G ఎల్​టీఈ, వైఫై 802.11ac, బ్లూటూత్​ v5.0, జీపీఓస్​/ ఏజీపీఎస్​, ఎన్​ఎఫ్​సీ, యూఎస్​బీ టైప్-సి పోర్ట్ వంటివి చేర్చింది. మరోవైపు యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్లను అందించింది. ఈ ఫోన్​లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా చేర్చింది. దీనిలో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వచ్చే 5,000mAh రిమూవబుల్​ బ్యాటరీని చేర్చింది.
Published by:Shiva Kumar Addula
First published: