హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nokia Smart Phone : నోకియా నుంచి అత్యంత చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చిందోచ్ ​.. అది తక్కువ ధరకు అందుబాటులో..

Nokia Smart Phone : నోకియా నుంచి అత్యంత చౌకైన 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చిందోచ్ ​.. అది తక్కువ ధరకు అందుబాటులో..

నోకియ్ ఫోన్ (ప్రతీకాత్మక చిత్రం)

నోకియ్ ఫోన్ (ప్రతీకాత్మక చిత్రం)

Nokia Smart Phone : ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ నోకియా నుంచి నోకియా జీ 300 (Nokia G300) స్మార్ట్​ఫోన్​ విడుదలైంది. నోకియా నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని 5జీ ఫోన్లలో కెల్లా అత్యంత చౌకైన 5జీ ఫోన్‌ ఇదే కావడం విశేషం.

ప్రముఖ మొబైల్​ (Mobile) తయారీ సంస్థ నోకియా నుంచి నోకియా జీ 300 (Nokia G300) స్మార్ట్​ఫోన్​ (Smart Phone) విడుదలైంది. నోకియా నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని 5జీ ఫోన్లలో కెల్లా అత్యంత చౌకైన 5జీ ఫోన్‌ ఇదే కావడం విశేషం. బడ్జెట్​ ధరలోనే ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఇది వాటర్​ నాచ్​ తరహా డిస్​ప్లేతో వస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. నోకియా G300 ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. ఈ ఫోన్​ ధర, ఫీచర్లను పరిశీలిద్దాం.

Realme: దసరా బొనాంజా.. రియల్ మీ నుంచి మరికొన్ని స్మార్ట్ ప్రొడక్ట్స్ లాంచ్.. అవి ఏంటంటే..


నోకియా జి 300 ధర, లభ్యత

నోకియా G300 సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని 4GB ర్యామ్​ + 64GB స్టోరేజ్ వేరియంట్ $ 199 (సుమారు రూ. 15,000) ధర అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ సింగిల్ మెటోర్ గ్రే కలర్​ ఆప్షన్​లో లభిస్తుంది. అక్టోబర్ 19 నుంచి అమెరికాలో దీని సేల్స్​ ప్రారంభమవుతాయి. అయితే భారత మార్కెట్​లో అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై ఎటువంటి స్పష్టత లేదు.

నోకియా జి 300 స్పెసిఫికేషన్లు

కొత్త నోకియా జి 300 ఆండ్రాయిడ్ 11 ఓఎస్​పై నడుస్తుంది. ఇది 6.52 -అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 4 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్​ను అందించింది. మైక్రో ఎస్​డీ కార్డు సహాయంతో ఈ స్టోరేజ్​ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరాలను అందించింది.

New Smart Phone: ఇండియాలో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..


సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం దీని ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాను చేర్చింది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. 5జీ, 4జీ ఎల్​టీఈ, వైఫై 802.11ac, బ్లూటూత్​ v5, జీపీఎస్​. ఎన్​ఎఫ్​సీ. యూఎస్​బీ టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటివి అందించింది. ఫోన్​ పక్క భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్​ను కూడా చేర్చింది. ఇక, బ్యాటరీ విషయానికి వస్తే.. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​ గల 4,470mAh బ్యాటరీని అందించింది.

First published:

Tags: Nokia, Technology

ఉత్తమ కథలు