NOKIA G21 SMARTPHONE LAUNCHED IN INDIA WITH UNISOC T606 PROCESSOR AND 3 DAY BATTERY BACKUP SS
Nokia G21: ఒకసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజుల బ్యాటరీ బ్యాకప్... నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్ రిలీజ్
Nokia G21: ఒకసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజుల బ్యాటరీ బ్యాకప్... నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్ రిలీజ్
(image: Nokia India)
Nokia G21 | నోకియా ఇండియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఏకంగా మూడు రోజుల బ్యాటరీ లైఫ్‌తో నోకియా జీ21 (Nokia G21) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ.
ఒకప్పుడు ఫీచర్ మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన నోకియా, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మాత్రం ఆ ఆధిపత్యం చూపించలేదనే చెప్పాలి. కానీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు పెంచుకోవడం కోసం నోకియా ప్రయత్నిస్తూనే ఉంది. సరికొత్త స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేస్తోంది. నోకియా జీ సిరీస్‌లో ఇండియాలో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. నోకియా జీ21 (Nokia G21) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు నోకియా 105 (2022), నోకియా 105+ (Nokia 105+) ఫీచర్ ఫోన్లను, నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్, నోకియా గో ఇయర్‌బడ్స్+ లాంఛ్ చేసింది. నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్‌లో 90Hz డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,050ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
నోకియా జీ21 ధర
నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. డస్క్, నార్డిక్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. నోకియా అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో కొనొచ్చు. ఆఫర్స్ విషయానికి వస్తే నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్‌ను నోకియా https://www.nokia.com/ వెబ్‌సైట్‌లో కొన్నవారికి రూ.3,599 విలువైన నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్ ఉచితంగా లభిస్తుంది. జీరో డౌన్‌పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజ్, నోకాస్ట్ ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.
నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ టెక్నా స్పార్క్ 8సీ, సాంసంగ్ గెలాక్సీ ఏ03 స్మార్ట్‌ఫోన్లలో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. మైక్రోఎస్‌డీ కార్డుతో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ చెబుతోంది.
నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రోషూటర్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,050ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో 10వాట్ ఛార్జర్ మాత్రమే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 3 రోజుల బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతుంది. 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.