హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Nokia G21 Review: నోకియా G21 స్మార్ట్‌ఫోన్ ఫుల్ రివ్యూ.. ఈ బడ్జెట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చా? లేదా?

Nokia G21 Review: నోకియా G21 స్మార్ట్‌ఫోన్ ఫుల్ రివ్యూ.. ఈ బడ్జెట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చా? లేదా?

నోకియా G21 స్మార్ట్‌ఫోన్ ఫుల్ రివ్యూ

నోకియా G21 స్మార్ట్‌ఫోన్ ఫుల్ రివ్యూ

భారతదేశంలో నోకియా (Nokia) జీ21 ధర రూ.12,999గా ఉంది. లాంగ్‌ బ్యాటరీ లైఫ్‌, స్టాక్ ఆండ్రాయిడ్ వంటి ఫీచర్‌లను అందిస్తోంది. నోకియా జీ21 గురించి పూర్తి వివరాలు ఈ రివ్యూలో తెలుసుకోండి.

నోకియా ఒకప్పుడు భారతీయ మార్కెట్‌ను శాసించింది. ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తోంది. నోకియా ఇటీవల ఇండియన్‌ మార్కెట్‌లోకి కొత్త నోకియా జీ21 ఫోన్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌లో ఫోన్‌ను కొనాలనుకొనే వారి కోసం ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. భారతదేశంలో నోకియా జీ21 ధర రూ.12,999గా ఉంది. లాంగ్‌ బ్యాటరీ లైఫ్‌, స్టాక్ ఆండ్రాయిడ్ వంటి ఫీచర్‌లను అందిస్తోంది. నోకియా జీ21 గురించి పూర్తి వివరాలు ఈ రివ్యూలో తెలుసుకోండి.

డిజైన్‌

నోకియా జీ21 డిజైన్ సాధారణంగా కనిపిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌తో పాటు ప్యాటర్న్డ్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది, ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ బ్యాక్ ప్యానెల్‌కు టాప్‌ లెఫ్ట్‌ కార్నర్‌లో ఉంటుంది. నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్ చాలా తేలికైనది, ఇది దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బాగా కలిసొచ్చే విషయం. మందపాటి బెజెల్స్, వాటర్-డ్రాప్ నాచ్, నాసిరకం నిర్మాణ నాణ్యతతో స్మార్ట్‌ఫోన్‌ను చౌకగా భావించే అంశాలు ఉన్నాయి. అయితే మొత్తంగా నోకియా G21 డిజైన్ ఆకట్టుకుంటుంది.

డిస్‌ప్లే

నోకియా జీ21 డిస్‌ప్లే 6.5-అంగుళాల ప్యానెల్, 1,600×720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఈ ధరలో వచ్చే ఫోన్‌ల కంటే కలర్‌ అక్యురసీ చాలా బాగుంది. స్క్రీన్ బ్రైట్‌నెస్‌, కలర్‌ అక్యురసీ బాగుండటంతో యూట్యూబ్ లేదా నెట్‌ఫ్లిక్స్‌లో వీడియోలను చూడటానికి నోకియా జీ21 బాగుంది.


పర్ఫార్మెన్స్, బ్యాటరీ

మిడ్‌ రేంజ్‌లో బడ్జెట్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తుంటే నోకియా జీ21 బెస్ట్‌ ఆప్షన్‌. ఇది ఫ్లాగ్‌షిప్ లాంటి సాఫ్ట్‌గా లేదు. కానీ సాధారణ వినియోగంలో.. నెమ్మదిగా లోడ్ అవుతున్న సమయాలు, యానిమేషన్‌లు ఉన్నప్పటికీ, స్మార్ట్‌ఫోన్ యాప్ క్రాష్‌లు లేదా లాగ్‌లను చూపించలేదు. స్మార్ట్‌ఫోన్ పనితీరు, యూజర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా నోకియా జీ21లో బెస్ట్‌ ఫీచర్‌గా నిలిచింది సాఫ్ట్‌వేర్. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎటువంటి బ్లోట్‌వేర్ యాప్‌లు లేదా అనవసరమైన అనుమతులు లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను సెటప్ చేయడం, ఉపయోగించడం సులభం.

అయితే నోకియా జీ21 ఇప్పటికీ ఆండ్రాయిడ్‌ 11పై నడుస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 అప్‌డేట్‌ను పొందడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. చివరి సెక్యూరిటీ అప్‌డేట్‌ కూడా 2022 ఏప్రిల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ జరిగింది, అదే నెలలో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. బ్యాటరీ బాగుంది, నోకియా జీ21 ఒక్క ఛార్జ్‌పై 2 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే రన్ అవుతుంది. సున్నా నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి స్మార్ట్‌ఫోన్ దాదాపు 2 గంటలు పడుతుంది.

కెమెరా

నోకియా జీ21లోని వెనుక కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. నోకియా జీ21లో కెమెరా క్వాలిటీ చాలా నిరాశపరిచింది. ఫోటోలు తక్కువ నాణ్యతతో కనిపిస్తాయి. లో లైట్‌ ఉన్నప్పుడు ఫోటోలు స్పష్టంగా కనిపించవు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ కెమెరా నుంచి చక్కని, స్పష్టమైన పిక్చర్‌లను పొందడం చాలా కష్టం. ఈ కెమెరాలో సున్నా నుంచి కనిష్ట పోస్ట్-ప్రాసెసింగ్ ఉంది. అయితే ఇమేజ్ క్వాలిటీకి మాత్రమే ప్రాసెసింగ్ అవసరం లేదు. 8-మెగాపిక్సెల్ షూటర్ అయిన ఫ్రంట్ కెమెరా, ఇమేజ్ క్వాలిటీ పరంగా కూడా సమానంగా ఉంటుంది.

కస్టమర్లకు సూచన

నోకియా జీ21, భారతదేశంలో రూ.12,999కు అందుబాటులో ఉంది. బ్రాండ్‌ అందిస్తున్న తక్కువ ధర కారణంగా చాలా మందికి ఆసక్తిని కలిగిస్తుంది. అయితే డిస్‌ప్లే, కెమెరా బాగా లేవు. ఇప్పటికీ ఏప్రిల్ 2022 సెక్యూరిటీ ప్యాచ్‌తో ఆండ్రాయిడ్‌ 11లో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌ డిజైన్ మాత్రం బాగుంది, ఫోన్‌ చాలా తేలికగా ఉంటుంది.

First published:

Tags: 5g mobile, Nokia, Smart phone, Tech news

ఉత్తమ కథలు