NOKIA G21 BUDGET SMARTPHONE MAY GOING TO LAUNCH IN FEBRUARY AND HERE ARE THE DETAILS OF THE LEAKED FEATURES ONLINE PRV GH
Nokia G21: ఫిబ్రవరిలో నోకియా G21 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఆన్లైన్లో లీకైన ఫీచర్ల వివరాలివే..
నోకియా g21 (photo: Twitter)
91 మొబైల్స్ నివేదిక ప్రకారం, నోకియా G21 స్మార్ట్‌ఫోన్ 6.5 -అంగుళాల HD+ డిస్ప్లేతో రానుంది. నోకియా G20 మీడియా టెక్ హీలియో G35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నోకియా (Nokia) భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Smart phone)ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. HMD గ్లోబల్ గతేడాది విడుదల చేసిన నోకియా G20 సక్సెసర్పై పని చేస్తోంది. నోకియా G21 పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకురానుంది. నోకియా కొత్త ఫోన్ కోసం మీరు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన పని లేదు. ఫిబ్రవరి ప్రారంభంలోనే ఇది భారత మార్కెట్లోకి రానున్నట్లు 91 మొబైల్స్ నివేదికలు సూచిస్తున్నాయి. నోకియా G21 (Nokia G21) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్ల (Specifications)ను సైతం నివేదిక పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరిలో ఎప్పుడైనా భారత మార్కెట్లోకి రావచ్చని లీకేజీలను బట్టి తెలుస్తోంది. అయితే, దీని కచ్చితమైన లాంచింగ్ తేదీపై స్పష్టత లేదు. కాగా, లాంచింగ్‌కు కొన్ని రోజుల ముందే నోకియా తన వెబ్సైట్లో స్మార్ట్‌ఫోన్ (Smart phone) వివరాలను టీజ్ చేసే అవకాశం ఉంది.
అయితే వచ్చే నెలలో నోకియా బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ రిలీజ్ (new phone) కావడం దాదాపు ఖాయమైందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే, గతేడాది జూలైలో నోకియా జీ 20 రూ.12,999 ప్రారంభ ధర వద్ద విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో జీ 21 ఫోన్‌ను లాంచ్ చేయాలని నోకియా (Nokia) ప్రయత్నిస్తోంది.
* నోకియా G21 స్పెసిఫికేషన్లు
91 మొబైల్స్ నివేదిక ప్రకారం, నోకియా G21 స్మార్ట్‌ఫోన్ 6.5 -అంగుళాల HD+ డిస్ప్లేతో రానుంది. నోకియా G20 మీడియా టెక్ హీలియో G35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (Internal storage)ను అందించనుంది. మైక్రో ఎస్డీ కార్డ్ (Micro SD card) సహాయంతో స్టేరేజ్ను మరింగా విస్తరించుకోవచ్చు. ఇక, కెమెరా విషయానికి వస్తే.. నోకియా G21 వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్ (Triple camera system)ను అందించనుంది. ఇందులో 50- మెగాపిక్సెల్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ రెండవ సెన్సార్, 2 -మెగాపిక్సెల్ మూడవ సెన్సార్ కెమెరాలు (Censor camera) ఉండనున్నాయి. ఈ కెమెరాలు అల్ట్రా-వైడ్, ర్ట్రెయిట్ ఎఫెక్ట్‌లను అందించే అవకాశం ఉంది.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ (Video calling) కోసం ముందు భాగంలో ప్రత్యేకంగా 13- మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను అందించనుంది. నోకియా తన G -సిరీస్ కోసం వాటర్-డ్రాప్ డిజైన్‌ను అనుసరిస్తున్నందున, G21 కూడా అదే డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. నోకియా G21 స్మార్ట్‌ఫోన్ 5050mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, డస్క్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.