ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో నోకియా స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. నోకియా జీ20 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు పరిచయం చేసింది. రూ.15,000 లోపు సెగ్మెంట్‌లో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ ఇది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 5,050ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 15 నుంచి కొనొచ్చు. నోకియా ఇండియా వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో లభిస్తుంది. ఈ రెండు వెబ్‌సైట్లలో జూలై 7 మధ్యాహ్నం 12 గంటలకు ప్రీ-బుకింగ్ సేల్ మొదలవుతుంది. నోకియా జీ20 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.12,999.
నోకియా జీ20 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 48మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగావకాశాలు... ఏడాదికి రూ.26.57 లక్షల వేతనం... రిజిస్టర్ చేయండి ఇలా
Amazon Prime Subscription: 50 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోండి ఇలా
Capture all that you lay your eyes on and trust the quad camera of Nokia G20 to bring all your moments to life. Subscribe now to get notified, click: https://t.co/c8lnmB2dvl#NokiaG20 #LoveTrustKeep pic.twitter.com/L1AJM2e5w9
— Nokia Mobile India (@NokiamobileIN) July 5, 2021
నోకియా జీ20 స్మార్ట్‌ఫోన్‌లో 5,050ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడు రోజులు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. నోకియా జీ20 స్మార్ట్‌ఫోన్ గ్లేసియర్, నైట్ కలర్స్‌లో లభిస్తుంది. డ్యూయెల్ నానో సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వైఫై, 4జీ, బ్లూటూత్ 5 వర్షన్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 197 గ్రాములు.
Mi 11 Ultra 5G: ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్ సేల్... ఎస్‌బీఐ కార్డుతో రూ.5000 డిస్కౌంట్
Vivo V21e 5G: రూ.24,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.4,140 ధరకే కొనండి ఇలా
నోకియా జీ20 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఏవీ ఉండవు. అంటే ప్రీలోడెడ్, జంక్ యాప్స్ లేకుండా క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. దీంతో పాటు రెండేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile, Mobile News, Mobiles, Nokia, Smartphone, Smartphones