Home /News /technology /

NOKIA CUTS PRICE ON 2 SMARTPHONES KNOW LATEST PRICE AND SPECIFICATIONS SS

Nokia Smartphones: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన నోకియా... లేటెస్ట్ రేట్స్ ఇవే

Nokia Smartphones: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన నోకియా... లేటెస్ట్ రేట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Nokia Smartphones: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన నోకియా... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Nokia Smartphones | నోకియా 5.4, నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి. లేటెస్ట్ ధరలతో పాటు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

    కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? నోకియా రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించింది. ఇండియన్ మార్కెట్‌లోకి నోకియా నుంచి కొత్త మొబైల్స్ వస్తుండటంతో పాత మోడల్స్ ధరల్ని తగ్గిస్తోంది. నోకియా 5.4, నోకియా 3.4 ధరలు తగ్గాయి. రిలీజ్ అయినప్పుడు నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.11,999 కాగా రూ.1,000 తగ్గింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999 ధరకే కొనొచ్చు. ఇక రిలీజ్ సమయంలో నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా ఇప్పుడు రూ.12,999 ధరకే కొనొచ్చు. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర కూడా రూ.1,000 తగ్గింది. రూ.14,499 ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్లలో కొత్త ధరలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం కొత్త కొత్త మోడల్స్‌ని పరిచయం చేస్తోంది. త్వరలో నోకియా నుంచి మరిన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. అందుకే పాత మోడల్స్ ధరల్ని తగ్గిస్తోంది.

    Jio 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా ఇచ్చే జియో రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

    Android 12 New Features: మీది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనా? ఈ 12 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి


    నోకియా 3.4 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.39 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా సెటప్ చూస్తే 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. బ్యాటరీ 4,000ఎంఏహెచ్. 5వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. చార్‌కోల్, డస్క్, ఎఫ్‌జార్డ్ కలర్స్‌లో కొనొచ్చు.

    Upcoming Smartphones: జూన్‌లో రిలీజ్ కాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

    ఇక నోకియా 5.4 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.39 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా వివరాలు చూస్తే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. బ్యాటరీ 4,000ఎంఏహెచ్. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. డస్క్, పోలార్ నైట్ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile, Mobile News, Mobiles, Nokia, Smartphone, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు