Nokia C30: భారత మార్కెట్​లోకి నోకియా సి 30 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్​..  జియో ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​తో రూ.10 వేలలోపే లభ్యం

నోకియా సీ30

ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ నోకియా నుంచి నోకియా సి 30 (Nokia C30) స్మార్ట్‌ఫోన్ భారత్​లో గురువారం లాంచ్​ అయ్యింది. దీనిపై జియో ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​ను కూడా ప్రకటించింది. వాస్తవానికి, నోకియా సి 30 జూలైలోనే గ్లోబల్​ మార్కెట్​లోకి విడుదలైంది. అయితే ఆలస్యంగా భారత మార్కెట్లోకి వచ్చింది.

  • Share this:
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ నోకియా నుంచి నోకియా సి 30 (Nokia C30) స్మార్ట్‌ఫోన్ భారత్​లో గురువారం లాంచ్​ అయ్యింది. దీనిపై జియో ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​ను కూడా ప్రకటించింది. వాస్తవానికి, నోకియా సి 30 జూలైలోనే గ్లోబల్​ మార్కెట్​లోకి విడుదలైంది. అయితే ఆలస్యంగా భారత మార్కెట్లోకి వచ్చింది. బడ్జెట్​ ధరలోనే ఇందులో అద్భుతమైన ఫీచర్లను సంస్థ అందించింది. జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్‌ కింద ఈ స్మార్ట్​ఫోన్​ కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్​ పొందవచ్చు. అంటే దాదాపు రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది.

నోకియా సి 30 ధర, ఆఫర్లు

భారతదేశంలో కొత్త నోకియా సి 30 మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3 జీబీ ర్యామ్​ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్​ రూ. 10,999, 4 జీబీ ర్యామ్​ + 64 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ రూ. 11,999 ధర వద్ద లభిస్తాయి. ఇవి గ్రీన్, వైట్ అనే రెండు కలర్లలో అందుబాటులో ఉంటాయి. ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు, నోకియా.కామ్‌లో ఈ ఫోన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ మీరు జియో ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​ ద్వారా ఈ ఫోన్​ను కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్​ (రూ. 1000 వరకు) లభిస్తుంది. మై జియో యాప్​ ద్వారా లేదా రిటైల్​ స్టోర్ల ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు.

ఒకవేళ మీరు ఫోన్​ను​ ఇటీవలి కాలంలో కొనుగోలు చేసినా సరే ఆఫర్​ వర్తిస్తుంది. అయితే ఫోన్ యాక్టివేట్ చేసిన 15 రోజుల్లోపు మై జియో యాప్ ద్వారా ఆఫర్ ఎన్​రోల్​ చేసుకోవాల్సి ఉంటుంది. విజయవంతంగా ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్న కస్టమర్ల బ్యాంకు ఖాతాకు 30 నిమిషాల్లోపు రూ.1000 ఆఫర్​ అమౌంట్ ట్రాన్స్​ఫర్​ అవుతుంది. అదనంగా రూ. 149 కంటే ఎక్కువ మొత్తంలో రీఛార్జ్​ చేసే వారికి మింత్రా, ఫార్మ్​ ఈజీ, ఓయో, మేక్​ మై ట్రిప్​లకు సంబంధించి రూ. 4,000 వోచర్లు లభిస్తాయి.

నోకియా సి 30 స్పెసిఫికేషన్లు

నోకియా సి 30 ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) పై నడుస్తుంది. ఇది 6.82 అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ యునిసోక్ SC9863A SoC ప్రాసెసర్​తో పని చేస్తుంది. దీనిలో 64 జీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్​ని అందించింది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. నోకియా సి 30 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్​ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉంటాయి. దీని ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. నోకియా C30 6 WmAh బ్యాటరీతో వస్తుంది. ఇది 10W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. దీనిలో 4G ఎల్​టీఈ, వైఫై 802.11 b/g/n, బ్లూటూత్ v4.2, జీపీఎస్, మైక్రో- యూఎస్​బీ, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి చేర్చింది.
Published by:Sambasiva Reddy
First published: