Home /News /technology /

NOKIA C20 PLUS WITH AN 8 MP DUAL REAR CAMERA SETUP LAUNCHED IN INDIA AT A STARTING PRICE OF JUST RS 8999 NS GH

Nokia C20 Plus: నోకియా నుంచి బడ్జెట్ స్మార్ట్​ఫోన్ లాంఛ్.. తక్కువ ధరతో అదిరిపోయే ఫీచర్లు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ నోకియా భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఈ ఫోన్ కు సంబంధించిన ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ నోకియా భారత విపణిలోకి సరికొత్త స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది. నోకియా సి 20 ప్లస్​ పేరుతో దీన్ని విడుదల చేసింది. గత నెలలోనే దీన్ని చైనా మార్కెట్​లోకి లాంచ్​ చేయగా.. అక్కడ మంచి ఆదరణ లభించింది. దీంతో ఇప్పుడు భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. HMD గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా తన ‘సీ’ సిరీస్​ను విస్తరించడంలో భాగంగా ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్​లో ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఓఎస్​ను అందించింది. తద్వారా తక్కువ ర్యామ్ గల ఫోన్లలోనూ అద్భుతమైన ఎక్స్​పీరియన్స్​ ఇస్తుంది.
Best Data Plans: మీరు డేటా ఎక్కువగా వినియోగిస్తారా? అయితే, డైలీ 3 జీబీ డేటా అందించే ఈ ప్లాన్లపై ఓ లుక్కేయండి

నోకియా సి 20 ప్లస్ ధర, లభ్యత
నోకియా సి 20 ప్లస్ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీని 2 GB RAM + 32 GB స్టోరేజ్ వేరియంట్ రూ .8,999 ధర వద్ద లభిస్తుండగా.. 3 GB RAM + 32 GB స్టోరేజ్ వేరియంట్ రూ .9,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది ఓషన్ బ్లూ, డార్క్ గ్రే అనే రెండు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. దీన్ని ప్రముఖ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. జియో ఎక్స్​క్లూజివ్​ ప్రోగ్రామ్​లో కొనుగోలు చేస్తే 10 శాతం లేదా రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు.

నోకియా సి 20 ప్లస్ స్పెసిఫికేషన్లు
నోకియా సి 20 ప్లస్ 6.5 అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1.6GHz ఆక్టా-కోర్ యునిసోక్ SC9863a ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది మొత్తం రెండు ర్యామ్​, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. 2 GB RAM, 32 GB స్టోరేజ్ వేరియంట్​తో పాటు 3 GB RAM, 32 GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్‌ని ఉపయోగించి ఫోన్​ స్టోరేజ్​ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్​ ఆండ్రాయిడ్​ 11 (గో ఎడిషన్​)పై పనిచేస్తుంది. మీరు గూగుల్​ నుంచి జీమెయిల్​, యూట్యూబ్​, మ్యాప్స్​ వంటి వాటిని సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్​ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్​తో లభిస్తుంది. ఈ సెటప్‌లో 8 MP మెయిన్​ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ కెమెరా, LED ఫ్లాష్ వంటివి చేర్చింది. ముందు భాగంలో 5 MP కెమెరాను అందించింది. పోర్ట్రెయిట్ మోడ్, హెచ్​డీఆర్​, బ్యూటిఫికేషన్ వంటి అనేక కెమెరా ఫీచర్లను దీనిలో ఉపయోగించుకోవచ్చు. ఇందులో 4,950 mAh బ్యాటరీని అందించారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు పనిచేస్తుంది. దీంతోపాటు వైఫై 802.11 b/g/n, బ్లూటూత్ v4.2, జీపీఎస్​, ఎఫ్​ఎం రేడియో, మైక్రో-యూఎస్​బీ, 4G ఎల్​టీఈ, 3.5 mm వంటి వివిధ కనెక్టివిటీ ఆప్షన్లకు మద్దతు ఇస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Nokia, Smart phone, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు