Home /News /technology /

NOKIA C1 PLUS ANDROID 10 GO EDITION LAUNCHED KNOW PRICE AND SPECIFICATIONS SS

Nokia C1 Plus: నోకియా సీ1 ప్లస్ రిలీజ్... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే

Nokia C1 Plus: నోకియా సీ1 ప్లస్ రిలీజ్... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే
(Image Credit: Nokia)

Nokia C1 Plus: నోకియా సీ1 ప్లస్ రిలీజ్... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే (Image Credit: Nokia)

Nokia C1 Plus | నోకియా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ధర, స్పెసిఫికేషన్స్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

    హెచ్ఎండీ గ్లోబల్ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. నోకియా సీ1 ప్లస్ రిలీజ్ చేసింది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ప్రస్తుతం యూరప్ మార్కెట్‌లో రిలీజైంది. నోకియా సీ1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అంటే ఇందులో ఉండే ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ లైట్ వర్షన్‌లో ఉంటాయి. ఇది బేసిక్ స్మార్ట్‌ఫోన్ కాబట్టి యాప్స్ సైజ్ చాలా తక్కువగా ఉంటుంది. ర్యామ్ 1జీబీ కాగా స్టోరేజ్ 16జీబీ. ఇందులో ముందు, వెనుక వైపు ఒకే కెమెరా ఉంటుంది. ధర 69 యూరోలు. ఇండియన్ కరెన్సీ లెక్కన చూస్తే సుమారు రూ.6,200 ఉండొచ్చు. ఫుల్ డే బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇతర స్పెసిఫికేషన్స్ చూస్తే క్వాడ్ కోర్ ప్రాసెసర్, సింగిల్ రియర్ కెమెరా, సింగిల్ సెల్ఫీ కెమెరా, 2,500ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. యూరప్‌లో నోకియా సీ1 ప్లస్ సేల్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. అయితే ఇండియాలో నోకియా సీ1 ప్లస్ బడ్జెట్ కేటగిరీలోని స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

    Moto G9 Power: కాసేపట్లో మోటో జీ9 పవర్ సేల్... భారీ బ్యాటరీతో మరెన్నో ప్రత్యేకతలు

    5G Smartphones: Jio 5G వచ్చేస్తోంది... మార్కెట్లో రెడీగా ఉన్న 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    నోకియా సీ1 ప్లస్ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
    ర్యామ్: 1జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ
    ప్రాసెసర్: క్వాడ్ కోర్ ప్రాసెసర్
    రియర్ కెమెరా: 5మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 5మెగాపిక్సెల్
    బ్యాటరీ: 2,500ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 గో
    సిమ్ సపోర్ట్:
    కలర్స్: బ్లూ, రెడ్
    ధర: సుమారు రూ.6,200
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Nokia, Smartphone, Smartphones

    తదుపరి వార్తలు