NOKIA C01 PLUS PRICE SMARTPHONE LAUNCHED JUST FOR RS 5999 KNOW SPECIFICATIONS SS GH
Nokia C01 Plus: రూ.5,999 ధరకే నోకియా C01 ప్లస్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్స్ ఇవే
Nokia C01 Plus: రూ.5,999 ధరకే నోకియా C01 ప్లస్ స్మార్ట్‌ఫోన్... ఫీచర్స్ ఇవే
Nokia C01 Plus | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తక్కువ ధరకే నోకియా సీ01 ప్లస్ (Nokia C01 Plus) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.
భారత బేసిక్, ఫీచర్ ఫోన్ల మార్కెట్లో గతంలో ఓ వెలుగు వెలిగిన నోకియా తర్వాతి కాలంలో ఇతర కంపెనీలకు ధీటుగా రాణించలేక పోయింది. దీంతో నోకియా (Nokia) ఫోన్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయితే భారత్‌లో మళ్లీ తన బ్రాండింగ్‌ను విస్తరించేందుకు నోకియా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. తక్కువ ధరలోనే బేసిక్ స్మార్ట్ఫోన్లను తీసుకొస్తోంది. నోకియా C01 ప్లస్ (Nokia C01 Plus) పేరిట 4జీ ఎంట్రీ లెవల్ బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించడం విశేషం.
నోకియా C01 ప్లస్ ధర
నోకియా C01 ప్లస్ సింగిల్ వేరియంట్లో లభిస్తుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 5,999 వద్ద అందుబాటులో ఉంటుంది. దీన్ని నోకియా.కామ్, అమెజాన్‌తో సహా ఇతర ఆన్లైన్ రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. నోకియా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లతో వస్తుంది. జియో యూజర్లు 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్‌తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అంటే జియో రిటైల్ స్టోర్లు లేదా మైజియో యాప్ ద్వారా కేవలం రూ. 5,399 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లేను అందించారు. ఇది 1.6 గిగా హెర్జ్ యునిసోక్ SC9863a 1.6GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. డివైజ్‌లో 2 జీబీ ర్యామ్,16 జీబీ స్టోరేజ్‌ను చేర్చింది. మైక్రో ఎస్డీ కార్డ్ సహాయంతో దీని స్టోరేజ్‌ను128GB వరకు పెంచుకోవచ్చు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. దీని వెనుకవైపు 5 మెగాపిక్సెల్ హెచ్‌డిఆర్ కెమెరా, ముందు భాగంలో 2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించింది. ఈ రెండు కెమెరాలు LED ఫ్లాష్‌లైట్‌తో వస్తాయి.
ఈ డివైజ్‌లో 3,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీన్ని రిప్లేస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సాధారణ వినియోగంలో ఒక రోజంతా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఓఎస్‌ను అందించింది. ఈ ఓఎస్ డేటా వినియోగాన్ని 60 శాతం తగ్గించడానికి, యాప్‌లను 20 శాతం వేగంగా రన్ చేసేందుకు ఉపయోగపడుతుంది. భద్రత కోసం, దీనిలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా చేర్చింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.