ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి సరికొత్త మోడల్ వచ్చేసింది. నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు పరిచయం చేసింది హెచ్ఎండీ గ్లోబల్. ఈజిప్ట్ రాజధాని కైరోలో కొద్ది రోజుల క్రితమే నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. ఆ తర్వాత ఒక్కో దేశంలో అధికారికంగా రిలీజ్ చేస్తోంది. ఇండియాలో కూడా నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ సేల్ ఉంటుందని కొంతకాలంగా టీజర్లు రిలీజ్ చేస్తోంది నోకియా. ఇప్పుడు సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 27న నోకియా 2.3 సేల్ ప్రారంభం కానుందని అధికారికంగా ట్విట్టర్‌లో వెల్లడించింది కంపెనీ. ధర రూ.8,199. నోకియా 2.3 మోడల్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న నోకియా 2.2 అప్‌గ్రేడెడ్ వర్షన్. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా పరిచయం చేసింది నోకియా. బ్యాటరీ రెండు రోజులు వస్తుందని చెబుతోంది. 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ధర రూ.8,199 కావడంతో బడ్జెట్ సెగ్మెంట్‌లో షావోమీ, రియల్‌మీ, సాంసంగ్, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఈ ఫోన్‌పై 1 ఏడాది రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ కూడా ప్రకటించింది నోకియా.
Aapke har kaam ko bada banane ki guarantee ab humaari kyunki aa gaya hai Nokia 2.3, 1 year replacement ki badi guarantee ke saath. Click on the link to find out more about the #BadeKaamKaPhone today. https://t.co/NqAD9cRlNI pic.twitter.com/BjIZ110imy
— Nokia Mobile India (@NokiamobileIN) December 18, 2019
నోకియా 2.3 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల హెచ్‌డీ+
ర్యామ్: 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ22
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: చార్‌కోల్, సియాన్ గ్రీన్, సాండ్
ధర: రూ.8,199
అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
WhatsApp: మీరు పంపిన మెసేజ్ మాయం చేయొచ్చు... వాట్సప్‌లో కొత్త ఫీచర్
Flipkart Year End Sale 2019: ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
PAN-Aadhaar Link Status: మీ ఆధార్ నెంబర్ పాన్ కార్డుతో లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Nokia, Smartphone