వామ్మో... ఐదు కెమెరాలతో వచ్చేస్తున్న నోకియా 9 ప్యూర్ వ్యూ

రియర్‌లో మొత్తం ఏడు రింగ్స్ కనిపిస్తాయి. అందులో ఐదు కెమెరా లెన్సులు. ఆరో రింగ్‌లో డ్యూయెల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. ఇక ఏడో రింగ్‌లో డ్యూయల్ సెన్సార్ ఉంటుంది. ఇన్ని కెమెరాలు ఉన్నాయంటే... మరి ఫోటోలు ఎంత అద్భుతంగా వస్తాయో చూడాలి.

news18-telugu
Updated: December 31, 2018, 2:44 PM IST
వామ్మో... ఐదు కెమెరాలతో వచ్చేస్తున్న నోకియా 9 ప్యూర్ వ్యూ
వామ్మో... ఐదు కెమెరాలతో వచ్చేస్తున్న నోకియా 9 ప్యూర్ వ్యూ (Image: Androidpure.com)
  • Share this:
ఒకటి కాదు... రెండు కాదు... మూడు, నాలుగు కాదు... ఏకంగా ఐదు రియర్ కెమెరాలతో ఫోన్ ఊహించగలరా? ఊహించడం కాదు... ఇంకొన్నిరోజులు ఆగితే ఏకంగా అలాంటి ఫోన్ చూడొచ్చు. షాకయ్యారా? ఇది నిజం కాబోతోంది. ఐదు రియర్ కెమెరాలతో కొత్త ఫోన్ తీసుకొస్తోంది నోకియా. పెంటా కెమెరా నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ జనవరిలో రిలీజ్ కానుంది. వెనుకవైపు ఐదు కెమెరాలు ఉండటమే ఈ ఫోన్ ప్రధాన విశేషం. రియర్‌లో మొత్తం ఏడు రింగ్స్ కనిపిస్తాయి. అందులో ఐదు కెమెరా లెన్సులు. ఆరో రింగ్‌లో డ్యూయెల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. ఇక ఏడో రింగ్‌లో డ్యూయల్ సెన్సార్ ఉంటుంది. ఇన్ని కెమెరాలు ఉన్నాయంటే... మరి ఫోటోలు ఎంత అద్భుతంగా వస్తాయో చూడాలి.

స్మార్ట్‌ఫోన్ల మధ్య కెమెరాల యుద్ధం కొత్తేమీ కాదు. ఎందుకంటే ఒక్కో కంపెనీ ఒక్కో కెమెరా పెంచుకుంటూ కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. గతంలో ఫోన్‌కు ఒక కెమెరా ఉండటమే గొప్ప. ఆ తర్వాత సెల్ఫీ కెమెరా వచ్చింది. కొన్నాళ్లకు రియర్‌లో రెండు కెమెరాలొచ్చాయి. తర్వాత సెల్ఫీ కోసం రెండు కెమెరాలు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితమే ట్రిపుల్ కెమెరా కూడా వచ్చింది. ఇలా స్మార్ట్‌ఫోన్ల కెమెరాలు ఒక్కొక్కటీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నోకియా 9 ప్యూర్ వ్యూ మోడల్‌కు రియర్‌లో 5 కెమెరాలు ఉండటం అంటే మామూలు విషయం కాదు. పెంటా-కెమెరా సెటప్‌తో రానున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం.

ఇక ఫీచర్స్ విషయానికొస్తే... 5.9 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్న నోకియా 9లో బ్యాటరీ కెపాసిటీ 4,150 ఎంఏహెచ్. డిస్‌ప్లే 5.9 అంగుళాలు ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉంటాయి. 2019 జనవరి చివరి నాటికి ఈ ఫోన్ లాస్ వెగాస్‌లో రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి:

IRCTC వెబ్‌సైట్ మారింది... కొత్త ఫీచర్లు ఇవే

ఫేక్ మొబైల్ యాప్స్‌ని అడ్డుకోవడానికి 5 టిప్స్తగ్గిన క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 10 మార్గాలు

మీ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: December 31, 2018, 12:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading