మన దేశంలో మామూలు ఫీచర్ ఫోన్లను వాడే వారి సంఖ్య తగ్గిపోతోంది. తక్కువ ఆదాయం ఉన్నవారు స్మార్ట్‌ఫోన్లలో బేసిక్ మోడళ్లను ఎంచుకుంటున్నారు. మొదటిసారి స్మార్ట్‌ఫోన్ వాడేవారికి ఇవి ఉపయోగపడతాయి. గూగుల్ ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల పనితీరు మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. ఫీచర్ ఫోన్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యేవారికి రూ.5,000 బడ్జెట్‌లో మంచి ఫీచర్లుండే ఫోన్లు లభిస్తున్నాయి. ఆకర్షణీయమైన డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరాలు, 4జీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ గో ఓఎస్ వంటి ఫీచర్లతో పాటు వివిధ రంగుల్లో ఇవి లభిస్తున్నాయి. ఈ విభాగంలో టాప్ టెన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.
నోకియా 2.1 ఆండ్రాయిడ్ వన్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్. ఇది స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 1GB ర్యామ్‌తో పనిచేస్తుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. 5.5 అంగుళాల (720 x 1280) డిస్ప్లే, 8 మెగాపిక్సెల్, 5మెగాపిక్సెల్ కెమెరాలు వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోని ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఒకటిగా నిలుస్తోంది.
నోకియా 1 స్మార్ట్‌ఫోన్ 1 జిబి ర్యామ్, మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తుంది. స్టైల్‌కు అనుగుణంగా మార్చుకునే వివిధ బ్యాక్ కవర్లను ఈ ఫోన్ ద్వారా పొందవచ్చు. 4.5 అంగుళాల (480 x 854) డిస్ప్లే, 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు, 2150 mAh బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం.
OPPO A33 2020: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ33 స్మార్ట్‌ఫోన్... ధర ఎంతంటే
Samsung Galaxy M31 Prime: సాంసంగ్ గెలాక్సీ ఎం31 ప్రైమ్ సేల్ మొదలైంది... అమెజాన్‌లో భారీ డిస్కౌంట్
ఆండ్రాయిడ్ గో ఆప్షన్ ఉండే స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మి గో అతి తక్కువ ధరలో లభిస్తుంది. దీని డిజైన్ ఆకట్టుకునేలా ఉంటుంది. స్క్రాచెస్‌ను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. ఐదు అంగుళాల (720 X 1280) డిస్ప్లే, 8, 5 మెగాపిక్సెల్ కెమెరాలు, 1 జిబి ర్యామ్, 3000 mAh బ్యాటరీ సామర్థ్యం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో రెడ్‌మి గో లభిస్తుంది.
లావా Z60s ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 1.1GHz మీడియాటెక్ ప్రాసెసర్, 1GB RAM, 16GB స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై లావా రెండేళ్ల వారంటీని కూడా అందిస్తుంది. ఐదు అంగుళాల (720 x 1080) డిస్ప్లే, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు, 2500 mAh బ్యాటరీ సామర్థ్యం ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం.
ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకునే వారికి, మొదటి సారి ఆండ్రాయిడ్ వాడేవారికి మైక్రోమాక్స్ భారత్ గో మంచి ఎంపిక. 4.5 అంగుళాల డిస్ప్లే, 5MP ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు, 1 జీబీ ర్యామ్, 2000 mAh బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ లభిస్తుంది. Android ఆపరేటింగ్ సిస్టమ్, మీడియాటెక్ ప్రాసెసర్తో ఇది పనిచేస్తుంది.
ఇది పూర్తి స్థాయి స్మార్ట్‌ఫోన్ కాదు. కానీ దీంట్లో ఫేస్‌బుక్, వాట్సాప్, జియో సూట్ యాప్‌లను వాడుకోవచ్చు. దీంతో 4జీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రూ .1,500 ధరకే జియో ఫోన్ లభిస్తుంది. 3 సంవత్సరాల పాటు వాడితే, ఈ ఫోన్‌కు మీరు చేసిన ఖర్చు తిరిగి చెల్లిస్తారు. 2.4 అంగుళాల (240 x 320) డిస్‌ప్లే, 2, 0.3 MP కెమెరాలు, 512 ఎంబి ర్యామ్, 2000 mAh బ్యాటరీ సామర్థ్యం, KAI OS ఆపరేటింగ్ సిస్టమ్, SPRD 9820A / QC8905 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో జియో ఫోన్ లభిస్తుంది.
Online Shopping Tricks: ఫెస్టివల్ సేల్‌లో ఆర్డర్స్ చేస్తున్నారా? ఈ ట్రిక్స్ మీకోసమే
Redmi Smartphone offers: ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్
నోకియా 8110 చూడటానికి జియో ఫోన్ మాదిరిగానే ఉంటుంది. మ్యాట్రిక్స్ సంస్థ నుంచి గతంలో వచ్చిన బనానా ఫోన్‌కు ప్రతిరూపంగా ఈ ఫోన్ను నోకియా సంస్థ విడుదల చేసింది. 2.45 అంగుళాల (240 X 320) డిస్‌ప్లే, 2 ఎంపీ కెమెరా, 4 జీబీ ర్యామ్, 1500 mAh బ్యాటరీ సామర్థ్యంతో 8100 ఫోన్ పనిచేస్తుంది. Android ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్కమ్ MSM8908 స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో లభిస్తుంది.
అమెజాన్ చొరవతో షావోమీ రెడ్మి 7ఏ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. అమెజాన్ మినియోగదారుల నుంచి ఇన్‌పుట్స్ తీసుకొని, వాటి ద్వారా 7ఏ ఫోన్‌ను రూపొందించారు. 4G LTE సపోర్ట్, 5.45 అంగుళాల (720 X 1440) డిస్‌ప్లే, 12,5 ఎంపీ కెమెరాలు, 2 జిబి ర్యామ్, 4000 mAh బ్యాటరీ సామర్థ్యం, Android ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ Android Marshmallow ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 1GB RAM, 8GB స్టోరేజీతో లభిస్తుంది. రెండు 5MP కెమెరాలు, 4.5 అంగుళాల (480 x 854) డిస్‌ప్లే, 2000 mAh బ్యాటరీ సామర్థ్యం, మీడియాటెక్ MT6580A ప్రాసెసర్తో బింగో 10 పనిచేస్తుంది.
మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్ 3 వెర్షన్ ఐదు అంగుళాల 854x480p డిస్ప్లేతో లభిస్తుంది. ఇది 1.3GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Android 5.1, 768MB ర్యామ్, 4GB ఇంటర్నల్ స్టోరేజ్, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ఫోన్‌లో ఉన్నాయి. ఇది డ్యూయల్ 3జీ సిమ్‌లతో పనిచేస్తుంది. 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలతో అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio phone, Nokia, Redmi, Smartphone, Smartphones, Xiaomi